Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»హెల్త్ ఇన్సూరెన్స్»హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నపుడు తీసుకొవలసిన జాగ్రత్తలు
హెల్త్ ఇన్సూరెన్స్ December 6, 2025No Comments0 Views

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నపుడు తీసుకొవలసిన జాగ్రత్తలు

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

ప్రజలు ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎంచుకునేముందు కింది అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

1. ప్రయోజనాలు, బీమా మొత్తం
ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎంచుకునే ముందు వయసు, మెడికల్ చరిత్రను చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా బీమా సంస్థ అందించే కవరేజీ ప్రయోజనాలను కూడా పరిశీలించాలి. అలాగే వెయిటింగ్ పీరియడ్​ను కూడా తనిఖీ చేయాలి.

2. బీమా సంస్థ మార్కెట్ ఖ్యాతి
ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది క్లెయిమ్ అమౌంట్​కు సంబంధించినది కావున జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎటువంటి అవాంతరాలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు మీ ఇన్సూరెన్స్ కంపెనీ కింది షరతులను అనుసరిస్తుంది.

  • హై క్లెయిమ్ సెటిల్​మెంట్ రేషియో – క్లెయిమ్స్ కోసం ఎంత మంది వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే.. వారిలో ఎంత మంది విజయవంతంగా క్లెయిమ్స్ పొందారనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వారు ఎంత శాతం అమౌంట్​ను పొందారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.
  • నిర్వహణలో ఉన్న ఆస్తులు – ఇది సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత మంది పాలసీలు తీసుకున్నారనే విషయాన్ని, అందులో ఎంత నిధులు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. అందరు పాలసీ దారుల నుంచి సేకరించిన ప్రీమియం అమౌంట్స్ మేనేజ్​మెంట్​ కింద ఉన్న ఆస్తులు​గా (నిర్వహణలో ఉన్న ఆస్తులు) పరిగణించబడతాయి. అధిక AUM విలువ సదరు బీమా కంపెనీ నుంచి అనేక మంది పాలసీలు తీసుకున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. మార్కెట్లోని దాని కీర్తిని ప్రతిబింబిస్తుంది.
  • సాల్వెన్సీ రేషియో – పలు క్లెయిమ్స్​ను ఒకే సమయంలో లేవనెత్తితే స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో కంపెనీ తన బాధ్యతలను ఎలా తీర్చుతుందనే విషయాన్ని ఇది సూచిస్తుంది. ఎక్కువ సాల్వెన్సీ రేషియో ఉంటే కంపెనీ మంచి మేనేజ్​మెంట్​​ను సూచిస్తుంది. ఎందుకంటే మేనేజ్ చేసే ఆస్తుల విలువ క్లెయిమ్స్ విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.
  • ఎన్నేళ్లుగా వ్యాపారంలో ఉంది – ఇది బీమా సంస్థ అనుభవం, క్లెయిమ్ సెటిల్​మెంట్ ఇంకా నిధుల​ పంపిణీ విధానం గురించి చర్చిస్తుంది.

3. నెట్​వర్క్ ఆస్పత్రులు
అధిక సంఖ్యలో నెట్​వర్క్ ఆస్పత్రులు ఉంటే నగదు రహిత క్లెయిమ్ బదిలీని నిర్ధారిస్తాయి. చికిత్సలో థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. అవాంతరాలు లేని చికిత్సను అందిస్తాయి.

4. సాధారణ మెడికల్ చెకప్స్
ప్రముఖ బీమా కంపెనీలు ప్రీ–యాన్యువల్ చెకప్స్​ను వాటి పాలసీదారుల కోసం అందిస్తాయి. ఈ చెకప్స్ వలన వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

5. రెన్యూవబులిటీ
ఏ బీమా పాలసీలలో అయితే జీవితాంతం రెన్యూవబులిటీ ఆప్షన్ ఉంటుందో అటువంటి వాటిని ఎంచుకోండి. ఈ సౌలభ్యం వలన వ్యక్తులు ఎటువంటి పరిస్థితిలో అయినా ఆర్థికంగా భద్రంగా ఉంటారు. కంపెనీలు స్థిరమైన ప్రీమియంలను కలిగి ఉంటాయి.

మీరు ఈ పాయింట్లను అనుసరించడం వలన మీకు సరిపోయే హెల్త్ పాలసీని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది. నామమాత్రపు ప్రీమియం చార్జీలతో హెల్త్ పాలసీని తీసుకోవడం వలన మీ జీవితంలో హెల్త్ ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఇది చూస్తుంది.

చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో ఒకే ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎంచుకుంటారు. సమయం ప్రకారం ఆ ప్లాన్​ను పునరుద్ధరించుకుంటూ ఉంటారు. సరైన ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleహెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ?
Next Article హెల్త్ ఇన్సూరెన్స్​లోని రకాలు

Related Posts

హెల్త్ ఇన్సూరెన్స్​లోని రకాలు

December 6, 2025

హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ?

December 6, 2025
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d