
స్థానిక రెడ్లబజార్ పొన్నూరు రోడ్‌లో వేంచేసిన శ్రీకనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో
వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ నిర్వాహాకులు అందించారు. కార్యక్రమంలో కమిటి అధ్యక్ష్య, ఉపాధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మద్దిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి మోరబోయిన నరసింహారావు, కోశాధికారి కల్లి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శులు మల్లం సత్యనారాయణ, అరవ ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపాటి మస్తాన్ రావు, పత్రి అప్పారావు, గోళ్ళ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

