
విద్యార్థిని శ్రీలక్ష్మికి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తున్న రవీంద్రనాద్‌రెడ్డి
గుంటూరు 23-01-2026 శుక్రవారం : విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి రంగోత్సవ్‌లో భాగంగా గుంటూరు రూరల్ మండలం పొత్తూరు జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె.లక్ష్మి చేతిరాత పోటీల్లో ప్రధమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈసందర్భంగా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.రవీంద్రనా«ద్‌రెడ్డి విద్యార్థిని శ్రీలక్ష్మికి జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహుకరించారు. ఈసందర్భంగా డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కష్ణ తులసి, ఉపాధ్యాయ బందం విద్యార్థినిని అభినందించారు.
