Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Uncategorized»పేద రోగుల సేవలో తరిస్తున్న జింకానా
Uncategorized January 19, 2026No Comments0 Views

పేద రోగుల సేవలో తరిస్తున్న జింకానా

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

–గుంటూరు జీజీహెచ్‌కు రూ.100 కోట్ల విరాళం
–గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్ధుల దాతత్వం
–పూర్వ వైద్య విద్యార్ధుల విరాళాలతో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం
– 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం
– రూ. 20 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ ఉమా గవని
– రూ. 10 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ పొదిల ప్రసాద్‌
–ఈనెల 30న సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి చదువు కున్న మాత సంస్థ రుణం తీర్చుకుంటూ సంస్థ అభివద్ధికి నిరంతరం అవిరళ కషి చేస్తున్నారు. ఆసంఘం పేరే జింకానా, గుంటూరు వైద్య కళాశాల లలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడి తాము చదువుకున్న కళాశాలను మరిచిపోకుండా అభివద్ధికి కషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల అల్యూమిని ఆఫ్‌ నార్త్‌ అమెరికా (జింకానా) 1981లో ఏర్పడింది. సుమారు 2,500 మంది పూర్వ వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతి ఏడాది తాము వైద్య వత్తిలో సంపాదించుకున్న ధనంలో కొద్దో గొప్పో గుంటూరు వైద్య కళాశాలకు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివద్ధికి విరాళంగా అందజేస్తూ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఏళ్ల తరబడి అభివద్ధి పనులకు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తున్నా జింకానా తాజాగా జీజీహెచ్‌లో ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. భవన నిర్మాణం పూర్తవడంతో ఈనెల 30న ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

    జింకానా ఆడిటోరియంతో వెలుగులోకి…
    జింకానా ఆధ్వర్యంలో కళాశాల, ఆసుపత్రికి ప్రతీ ఏడాది నిధులు అందుతున్నా 2004లో కళాశాల లో జింకానా ఆడిటోరియం నిర్మాణంతో పూర్వ విద్యార్థుల సేవలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.2.50 కోట్లతో ఉమ్మడి రాష్ట్రాల్లో ఏవైద్య కళాశాలలో లేని విధంగా 850 నీటింగ్‌ సామర్థ్యంతో విదేశాల్లో ఉండే మాదిరిగా జింకానా ఆడిటోరియం నిర్మించారు. ఈ ఆడిటోరియంపలువురు ఉన్నతాధికారుల మన్ననలు
    సైతం పొందింది. 2009లో డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ, ట్రామా సెంటర్‌ నిర్మాణంలో జింకానా సభ్యుల పాత్ర ఎంతో కీలకం. రూ.35 కోట్లతో భవన నిర్మాణం జరుగ్గా అందులో రూ. 20 కోట్లు జింఖానా సభ్యులు విరాళంగా అందజే శారు. డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ ఒక్కరే రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో పొదిల ప్రసాద్‌ భవన నిర్మాణం జరిగింది.ప్రపంచ స్థాయి మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్స్‌ జింఖానా బిల్డింగ్‌లో నిర్మించడంతో డాక్టర్‌ గోపాలకష్ణ గోఖలే ఆధ్వర్యంలో గతంలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేయడంతో గుంటూరు జీజీహెచ్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కిడ్ని మార్పిడి. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో జరిగాయి.

    వైద్య విద్య బలోపేతం కోసం…
    గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించడంలో జింకానాతన వంతు పాత్ర పోషిస్తోంది. కళాశాలలో లెక్చ రర్‌ గ్యాలరీలు ఆధునీకరించి ఆడియో, వీడియో సిస్టమ్స్‌ ఏర్పాటు చేసి ఎంసీఐ గుర్తింపు కోసం ఇబ్బంది లేకుండా చేశారు. దాంతోపాటు ఈ–లై బ్రరీ నిర్మించి వైద్య విద్యలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా మెరుగు పరిచారు. వైద్య విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. వారిలో పరిశోధనలు ప్రొత్సహించేందుకు సైతం అవార్డులు ఇస్తున్నారు. బోధనా సిబ్బందికి సైతం నైపుణ్యం పెంపొందించేందుకు, పరిశోధనలు చేసేందుకు పలు అవార్డులు, పారితోషికాలు అందజేస్తున్నారు. ప్రతి ఏడాది జింకానా సభ్యులు అమెరికా నుండి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్యకళాశాలకు విచ్చేసి తమ మాత సంస్థ రుణం తీర్చుకునేందుకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    తాజాగా ఎంసీహెచ్‌ నిర్మాణంరాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు సంర క్షణ కేంద్రం (ఎంసీహెచ్‌వార్డు) నిర్మించాలని నిర్ణ యించాయి. సుమారు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఎంసీహెచ్‌ నిర్మాణం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమై చివరి దశకు చేరుకుంది. భవన నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అడ్డంకులన్ని తొలగిపోయేలా గత
    ప్రభుత్వం చేయూతనివ్వడంతో జింఖానా సభ్యులు రూ. 100 కోట్లు విరాళం ఇచ్చి భవన నిర్మాణం పూర్తి చేశారు. గతంలో జీజీహెచ్‌లో డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్‌ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ పాదిల ప్రసాద్‌ ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం కోసం మరో రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. అతేకాకుండా డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌పైన రెండంతస్తులు నిర్మాణం చేసేందుకు రూ. 10 కోట్లు విరాళం అందజేశారు. జింకానా సభ్యుల్లో 200 మంది విరాళాలు అందించారు. వీరిలో అత్యధికంగా డాక్టర్‌ ఉమ గవిని రూ. 20 కోట్లు అందజేయడంతో ఆమె భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరుతో ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం చేస్తున్నారు. డాక్టర్‌ కె.వెంకట్రావు, రమాదేవి వాసిరెడ్డి దంపతులు రూ.4.3 కోట్లు, డాక్టర్‌ మువ్వా వెంకటేశ్వరరావు, వేదవతి దంపతులు రూ. 4 కోట్లు, తాతినేని గోపాలరావు రూ. 4 కోట్లు ఎంసీహెచ్‌ నిర్మాణం కోసం అందజేశారు.

    ఎంసీహెచ్‌ ప్రత్యేకతలు
    రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా లేని విధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) 600 పడకలతో ఐదంతస్తులు భవనాన్ని నిర్మించారు. అప్పుడే పుట్టిన పసికందులకు, గర్భిణులు, బాలింతలకు కార్పొరేట్‌ వైద్యసేవలు ఎంసీహెచ్‌ వార్డులో ఉచితంగా అందనున్నాయి. ఆబ్‌స్టిక్స్‌ అండ్‌ గైనకాలజీ 320 పడకలు, పీడియాట్రిక్‌ సర్జరీ 80 పడకలు, పీడియాట్రిక్‌ వైద్య విభాగానికి 200 పడకలు కేటాయించారు. ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో నిర్మించిన అత్యాధునిక మాడ్యూలర్‌ ఆపరేషన్‌ థియేటర్లు తొమ్మిది ఉన్నాయి. 300 మంది
    కూర్చునేలా ఆడిటోరియం నిర్మించారు. పుట్టిన పసికందుకు ఏవిధంగా పాలు పట్టాలనే విషయాలు వివరించేందుకు కంగారు మదర్‌ కేర్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ కాన్పులు అయ్యేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంకు కూడా ఏర్పాటు చేశారు. ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంసీహెచ్‌ వార్డు ప్రారంభించేందుకు ఆసుపత్రి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 29న జింకానా సభ్యులంతా ఎంసీహెచ్‌ వార్డులో హాజరు కానున్నారు.

    జింకానా దేశానికే ఆదర్శం
    – డాక్టర్‌ యశశ్వి రమణ, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్, గుంటూరు
    గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌ అభివద్దే ధ్యేయంగా జింఖానా పనిచేస్తోంది. విదేశాల్లో ఉన్న పూర్వ వైద్య విద్యార్థులంతా ప్రతిరోజూ తాము చదువు కున్న కళాశాలలో, తమకు వత్తి మెలకువలు నేర్పించిన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరిగేందుకు విరివిగా విరాళాలు ఇస్తున్నారు. తాము విదేశా ల్లో ఉండి రాత్రిం బవళ్లు కష్టపడి తమ సంపా దనలో మాత సంస్థ అభివద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ప్రతి ఏడాదీ కళాశాలలో అత్యధిక మార్కులు సాధిస్తున్న మెడికోలకు, వైద్యులకు ఆవార్డు లు, పారితోషికాలను అందజేస్తూ వైద్య విద్యను ప్రోత్సహిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు
    జింకానా పేరుతో మాత సంస్థ అభివద్ధికి చేస్తున్న సహాయాన్ని చూసి దేశ వ్యాప్తంగా పలు కళాశాలల వారు ఆదర్శంగా తీసుకుని తమ మాత సంస్థలను అభివద్ధి చేసుకునేందుకు ముందుకు రావడం జింకానా గొప్పతనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు.

    Like this:

    Like Loading...

    Related

    Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
    Share. Facebook Twitter Telegram WhatsApp
    Previous Articleమధ్యవర్తిత్వంపై శిక్షణా తరగతులు
    Next Article ప్రజా సమస్యల పోరాటాలపై ప్రశంసలు

    Related Posts

    ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

    February 2, 2026

    జిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన కమీషనర్ & మేయర్

    January 26, 2026

    గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన నూరిఫాతిమా

    January 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    • Collectorate
    • CPI
    • Education
    • GMC
    • Lakshman Rao
    • Local News
    • TDP
    • Uncategorized
    • YSRCP
    • ఆరోగ్యం
    • ఆరోగ్య చిట్కాలు
    • ఇన్సూరెన్స్
    • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
    • క్రైమ్
    • చలికాలం
    • టర్మ్ ఇన్సూరెన్స్
    • దంపతులు
    • నూరిఫాతిమా
    • పోలీస్
    • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
    • లైఫ్ ఇన్సూరెన్స్
    • విశ్లేషణ
    • స్ట్రెస్‌
    • హెల్త్ ఇన్సూరెన్స్
    Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
    • Local News
    • ఆరోగ్యం
      • చలికాలం
      • దంపతులు
      • ఆరోగ్య చిట్కాలు
      • స్ట్రెస్‌
    • క్రైమ్
    • విశ్లేషణ
    • ఫైనాన్స్
      • బ్యాంకింగ్
    • ఇన్సూరెన్స్
      • లైఫ్ ఇన్సూరెన్స్
        • టర్మ్ ఇన్సూరెన్స్
      • హెల్త్ ఇన్సూరెన్స్
    © 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

    Type above and press Enter to search. Press Esc to cancel.

     

    Loading Comments...
     

      %d