
జిల్లాలో పీఎంఈవై ఇళ్ళ నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అత్యదిక ప్రాధాన్యత ఇచ్చి పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయల సేవలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవో లు మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే–అవుట్లు లోని ఆప్షన్ 1, 2 లోని ఇళ్ళు నిర్మాణాలు ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాన్నారు. ఆప్షన్ 3 లో నిర్మించిన ఇళ్ళలో స్టేజ్, క్వాలిటీ డివియేషన్స్‌ను కాంట్రాక్టుతో వెంటనే సరిచేయించాలన్నారు. పీఎంఏవై 2.0 లో మంజూరు చేసిన ఇళ్ళ నిర్మాణాల పనులు జనవరి నెల 31 నాటికి నూరుశాతం గ్రౌండింగ్ చేయాలన్నారు. పాజిటివ్ పర్సెప్షన్‌లో మరింత మెరుగ్గా ఫీడ్ బ్యాక్ వచ్చేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. మన మిత్రా వాట్సాప్ గవర్నర్ సేవలు మరింత విస్తత స్థాయిలో ప్రజలు వినియోగించుకునేలే అవగాహన కల్పించాలన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఫిబ్రవరి 10 నాటికి పూర్తయ్యేలా సచివాలయ ఉద్యోగులతో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్ మరింతగా మెరుగుపరచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన పనులు మార్చి 31 నాటికి ఖచ్చితంగా పూర్తి చేసి బిల్లులు ఆన్ లైన్ నమోదు చేయాలన్నారు. పూర్తియిన పనులకు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఫోటోలు, డాక్యుమెంట్లు ఖచ్చితంగా అప్లోడ్ చేసేలా ఏపీఓలు, ఎంపీడీవో చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులందరూ ఐజీఓటీ కర్మయోగి కోర్సులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పిడి శంకర్, సీపీఓ శేషశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, పశుసంవర్ధక శాఖ జెడీఎ కెవీవీ సత్యన్నారాయణ , జిల్లా జీఎస్ డబ్లు్యఎస్ అధికారి పీహెచ్ కష్ణ, ఈఈ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
