
– అవయవదానంతో నూతన జీవితాలు ప్రసాదించారు
– కిమ్స్ శిఖరలో విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
– లివర్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికితో ఆపరేషన్ ప్రక్రియలో పాల్గొన్న వైద్య బందం
గుంటూరు 24-01-2026 శనివారం :
బ్రెయిన్ డెడ్‌తో చనిపోతున్న ఇరువురు వద్ధులు అవయవదానంతో ఇరువురికి నూతన జీవితాలు ప్రసాదించారు. గుంటూరు కిమ్స్ శిఖర హాస్పటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇరువురు రోగులకు లివర్ మార్పిడి ఆపరేషన్లు చేసి జీవితాలను ప్రసాదించారు.
వివరాల్లోకి వెళితే కష్ణా జిల్లాకు చెందిన సి.హెచ్.సుబ్బలక్ష్మి (61) గుంటూరు కిమ్స్ శిఖర హాస్పటల్‌లో ఈనెల 8న అనారోగ్యం బారిన పడి చేరి, ఈనెల 10న బ్రెయిన్ డెడ్ అయింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన కడియం నాగమల్లేశ్వరి (60) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 8న గుంటూరు కిమ్స్ శిఖర హాస్పటల్‌లో చేరింది. చికిత్సపొందుతూ ఈనెల 11న బ్రెయిన్ డెడ్ అవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీవన్‌ధాన్ ప్రతినిధులు అవయవదానం ప్రాముఖ్యత గురించి బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులను సంప్రదించడంతో స్వచ్చందంగా అవయవదానం చేశారు.
గుంటూరు కిమ్స్ శిఖర హాస్పటల్‌లో చికిత్స పొందుతూ కాలేయ మార్పిడి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న ఇరువురు బాధితులకు బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి లివర్ సేకరించి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈవిషయాన్ని శనివారం గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని కిమ్స్ శిఖర హాస్పటల్‌లో జరిగిన మీడియా సమవేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు.
ఆపరేషన్‌ల ప్రక్రియలో పాల్గొన్న వైద్య బందానికి, వైద్య సిబ్బందికి ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ సురేష్‌కుమార్‌కు కిమ్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ బొలినేని భాస్కరరావుకు, డైరెక్టర్ బొలినేని అద్విక్‌కు యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ కె.వినోద్, డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కష్ణప్రభు కతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ హరికుమార్ మాట్లాడుతూ మరణానంతరం వారి అవయవాలను దానం చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమర్చడం ద్వారా, మరలా జీవించే అవకాశం కల్పించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవన్‌ధాన్ ట్రస్టు ద్వారా అయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవయవాలను త్వరగా తరలించేందుకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.