Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Collectorate»ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకలు – జెండా అవిష్కరించిన జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా
Collectorate January 26, 2026Updated:January 26, 2026No Comments14 Views

ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకలు – జెండా అవిష్కరించిన జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp


77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అపూర్వ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమైనవన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ వంటి పది ముఖ్య సూత్రాలను దష్టిలో ఉంచుకొని, రాబోయే ఐదు సంవత్సరాలలో 15 శాతం కంటే ఎక్కువ జీఎస్‌డీపీ వద్ది రేటుతో జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలను వ్యర్థ రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్షా్యన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 42,575 ఫిర్యాదులు స్వీకరించగా 39,742 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని, రెవిన్యూ క్లినిక్‌ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చి భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు వీలైనంత వేగంగా పరిష్కరించుటకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్నారన్నారు.

వ్యవసాయ శాఖ ద్వారా ‘అన్నదాత సుఖీభవ’, పిఎం కిసాన్‌ పథకాల క్రింద రైతులకు రూ.140.24 కోట్ల పెట్టుబడి సాయం అందించామని, రైతు సేవ కేంద్రాల ద్వారా 48,289 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా 1,044 మంది రైతులకు రూ.20.88 కోట్ల పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు మంజూరు చేశామని, మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల విడుదలను 13.5 లక్షల నుంచి 16.68 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. జిల్లా లీడ్‌ బ్యాంకు ద్వారా జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.31,729 కోట్ల లక్షా్యనికి గాను, 31 డిసెంబర్‌ 2025 నాటికి రూ.25,604 కోట్ల రుణాలు (81%) మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.

జలవనరుల శాఖ ద్వారా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు 24 టీఎంసీల సాగునీరు విడుదల చేశామని, గుంటూరు చానెల్‌ పొడిగింపు పనులకు రూ.274.53 కోట్ల పరిపాలనామోదం లభించి భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డా. ఎన్‌.టి.ఆర్‌. వైద్య సేవ పథకం ద్వారా 1.42 లక్షల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. డీసీహెచ్‌ఎస్‌ సెకండరీ హెల్త్‌ ద్వారా ఈ జిల్లా వైద్యశాలలో రూ.47 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ 2026 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుందని, 100 పడకల ఏరియా వైద్యశాల రూ.57 కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆర్థో – ట్రామా బ్లాక్‌ రూ.10 కోట్లతో ప్రారంభమైందన్నారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) 2.0 క్రింద ఈ జిల్లాలో 4,307 ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించి, వాటిలో 1,898 ఇళ్లు మంజూరు చేసి, ప్రతి ఇంటికి రూ.2.50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు.

జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ ద్వారా జాతీయ సరస్‌ మేళా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు జాతీయ స్థాయి మార్కెట్‌ లభించి సుమారుగా రూ.25 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో గుంటూరు జిల్లాలో ఉపాధి శ్రామికులకు 20 లక్షల పని దినాల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 17.61 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా రూ.194.98 కోట్ల అంచనా విలువతో 265.54 కి.మీ తారు రోడ్లు మరియు 3 బ్రిడ్జీల నిర్మాణానికి 87 పనులు మంజూరు చేయగా, వాటిలో 16 పనులు పూర్తి చేయగా, 21 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుత జనాభాకు అవసరమైన 72 ఎంఎల్‌డీ సమగ్ర త్రాగునీటి సరఫరా కోసం రూ.393.74 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అభివద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు.

జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు ద్వారా రూ.702 కోట్లు పెట్టుబడి రావడం జరిగిందన్నారు. ప్రొహిబిషన్,ఎ క్సైజ్‌ శాఖ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1,234.73 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleజిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన కమీషనర్ & మేయర్
Next Article 30న జి.జి.హెచ్ ఎం.సి.హెచ్ బ్లాక్ ప్రారంభించ నున్న సి.యం

Related Posts

ప్రజల సంతృప్తి స్థాయిని మరింతగా మెరుగుపరిచేలా రెవెన్యూ సేవలు అందించాలి

January 28, 2026

30న జి.జి.హెచ్ ఎం.సి.హెచ్ బ్లాక్ ప్రారంభించ నున్న సి.యం

January 28, 2026

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళి

January 23, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d