
గణ తంత్ర దినోత్సవం సందర్బంగా∙ రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనటానికి కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఎ.స్వాతికి ఆహ్వానం అందింది. ప్రకతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ 2016 నుంచి ప్రకతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల దేశీ వరి రకాలు భర్తతో కలిసి 20 ఎకరాలు సాగు చేస్తున్నారు. ప్రకతి వ్యవసాయ విధానాలు పూర్తిగా పాటిస్తూ ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడకుండా రసాయన రహిత వ్యవసాయం చేస్తున్న స్వాతికు అరుదైన గౌరవం లభించడం పట్ల జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారీయా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్టు అధికారి రాజకుమారి స్వాతిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
