
గుంటూరు ది. 02-02-2026 సోమవారం : గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ వద్ద ఆదివారం ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ శిబిరంలో గుండె, రక్తపోటు, మధుమేహం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించి సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి, వైద్యుల సూచనలతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకిఫ్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపారు. సమయానికి చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చని, తద్వారా ఆరోగ్యవంతమైన, సుఖవంతమైన జీవితం గడపవచ్చని సూచించారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎం.ఏ. సమీనా ఫరీన్, డాక్టర్ షేక్ రేష్మతో పాటు ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో వైద్య సేవలు అందించారు. రోగులకు అవసరమైన ఆరోగ్య సూచనలు ఇవ్వడంతో పాటు జీవనశైలి మార్పులపై అవగాహన కల్పించారు.
అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు 10వ లైన్, ఆనంద్‌పేట, పంచవటి బోర్డు సమీపంలో, పొన్నూరు రోడ్, గుంటూరు లోని ఐరా హార్ట్ & పాలీక్లినిక్‌ను సంప్రదించాలని డాక్టర్ ఆకిఫ్ అహ్మద్ బేగ్ తెలిపారు.
వివరాల కోసం 0863-2214511, 8121214511 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు
