
2025–26 రెండో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్నులు చెల్లించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో కోరారు. పన్నులను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లలో చెల్లించవచ్చన్నారు. నగర పాలకసంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్లు చెల్లించవచ్చన్నారు. బకాయిదార్లు మార్చి వరకు వేచి ఉండకుండా చెల్లించాలన్నారు. ఇప్పటికే వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు టార్గెట్లు విధించామన్నారు. వసూళ్ళపై సమీక్ష చేస్తామని, అవసరమైతే సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్ లైన్ ద్వారా cdma.ap.gov.in, పురమిత్ర యాప్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చన్నారు.

