మన దినచర్యలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు చూడటమే ఎక్కువైపోయింది. సగటున ఐదారు గంటలు స్క్రీన్‌ టైమ్‌ ఉంటోంది. దీనివల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయి, పొడిబారిపోతున్నాయి. ఒక్కోసారి చూపు మసకబారుతోంది. అందుకే కళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఇప్పుడు చాలా అవసరం.

జూమింగ్‌ (Zooming) : ఎలా చేయాలి: ఇది దూరంలో ఉన్న ఒక వస్తువు లేదా పాయింట్‌ను చూసి, ఆ తర్వాత వెంటనే దగ్గర్లోని వస్తువు లేదా పాయింట్‌పై దష్టిని మార్చడం.
ప్రయోజనాలు: ఇలా చాలాసార్లు చేయడం వల్ల కళ్ళకు ఒక పాయింట్‌ నుంచి ఇంకో పాయింట్‌కు దష్టిని మార్చే సామర్థ్యం పెరుగుతుంది. ఇది దూరదష్టి (ప్రెస్బియోపియా), కళ్ళ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
ఎవరికి ఉపయోగం: ఎక్కువసేపు స్క్రీన్‌ చూసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
పెన్సిల్‌ పుష్‌-అప్స్‌ (Pencil Pushups)
ఎలా చేయాలి: ఈ వ్యాయామంలో ఒక పెన్ను లేదా పెన్సిల్‌ను చేతి పొడవులో పట్టుకుని, ఆ తర్వాత నెమ్మదిగా ముక్కు దగ్గరకు తీసుకురావాలి. అలా చేస్తూనే పెన్సిల్‌ చివరపై దష్టిని అలాగే ఉంచాలి. దీన్ని నెమ్మదిగా చేస్తూ చాలాసార్లు పునరావతం చేయాలి.
ప్రయోజనాలు: ఇది రెండు కళ్ళకు దగ్గరగా ఉండే వస్తువులపై దష్టి పెట్టే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది.
ఎవరికి ఉపయోగం: ఎక్కువ పని చేసే వారికి లేదా ఎక్కువసేపు స్క్రీన్‌ చూసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
నిరంతరం దష్టి పెట్టడం (Constant Focusing)
ఎలా చేయాలి: ఇది చాలా దూరంలో ఉన్న ఒక చిన్న వస్తువు లేదా పాయింట్‌ లేదా దీపం మంటను కనురెప్పలు వాల్చకుండా చాలాసేపు నిరంతరాయంగా చూడటం. ఇలా చేయడం వల్ల చివరికి కళ్ళల్లో కొద్దిగా నీరు వస్తాయి.
ప్రయోజనాలు: ఇది ఏకాగ్రతను, కంటి కండరాలకు ఒకే చోట దష్టిని నిలిపి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది.
కంటి భ్రమణం : 9 దిశల చూపు
ఎలా చేయాలి: కళ్ళను మొదట నెమ్మదిగా, ఆ తర్వాత వేగంగా మధ్యలో నుంచి ఎనిమిది ఇతర దిశలకు కదపాలి. అం టే, ఎడమ, కుడి, పైకి, కిందకు, పైకి ఎడమ, పైకి కుడి, కింద కు ఎడమ, చివరికి కిందకు కుడి వైపుకు చూస్తూ, ప్రతి సారీ మరొక దిశకు వెళ్ళే ముందు మళ్ళీ మధ్యలోకి తిరిగి రావాలి.
ప్రయోజనాలు: ఈ వ్యాయామం కళ్ళను వివిధ దిశలలో కదపడానికి బాధ్యత వహించే అదనపు కంటి కండరాల మొత్తం బలం, పనితీరును మెరుగుపరచడానికి చేస్తారు. సవ్యదిశలో, అపసవ్యదిశలో నెమ్మదిగా కళ్ళను తిప్పడం వల్ల ఈ కండరాలు ఉత్తేజపడతాయి.

Share.
Leave A Reply

Exit mobile version