…
Author: subhanih@gmail.com
చలికాలమంటేనే శీతగాలి కోత. అదీ పొడిగాలి తాకిడి. దీంతో చర్మం తేమను కోల్పోతుంది. మరోవైపు చర్మంలో సహజ నూనె ఉత్పత్తీ తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. చివరికి చర్మం మీది రక్షణ పొర సైతం దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం కళ కోల్పోవటమే కాదు.. కొన్ని సమస్యలూ ముంచుకొస్తాయి. అప్పటికే ఉన్న సోరియాసిస్, ఎగ్జిమా వంటివీ ఉద్ధృతమవుతుంటాయి. మరి చలికాలంలో వీటిని అదుపులో ఉంచుకునేదెలా? చర్మం మరింత దెబ్బతినకుండా చూసుకునేదెలా? తెలుసుకుందాం పదండి. సోరియాసిస్ పొలుసుల బెడద చర్మాన్ని పొలుసులు పొలుసులుగా.. పొట్టుపొట్టుగా రాలగొట్టే సోరియాసిస్ దీర్ఘకాల సమస్య. రాలిపోయే వాటి కన్నా కొత్త చర్మకణాలు ఎక్కువగా పుట్టుకురావటమే దీనికి మూలం. చలికాలంలో చర్మం పొడిబారటం వల్ల ఇది ఉద్ధృతమవుతుంటుంది కూడా. నూటికి 80 మందిలో ఇలాంటి పరిస్థితిని గమనిస్తుంటాం. జాగ్రత్తలు ఇవీ..వేడినీటితో స్నానం చేస్తున్నప్పుడు హాయిగానే ఉంటుంది. కానీ ఇది చర్మంలోని నూనెను తొలగిస్తుంది. దీంతో చర్మం పొడిబారటం ఎక్కువుతుంది. ఇది…
చలికాలం కొందరికి హాయిగానే ఉంటుంది. కొందరికి మాత్రం నొప్పులతో వేధిస్తుంది. అవును. చలికాలంలో కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రమవుతుంటాయి. భుజాలు బిగుసుకుపోవటం, మోకాళ్లలో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై.. క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తుంటాయి. దీంతో మెట్లు ఎక్కటం, ముందుకు వంగటం, కాఫీ చేత్తో పట్టుకోవటం వంటి మామూలు పనులూ పెద్దవిగా తోస్తుంటాయి. ఇంతకీ చలికాలంలో నొప్పులు ఎందుకు తీవ్రమవుతాయి? కారణాలు ఇవీ..కండరాలు బిగుసుకోవటం: వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు, స్నాయువులు బిగుతుగా అవుతాయి. దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా మెడ, నడుం, మోకాళ్లు, భుజాల నొప్పులు ఎక్కువవుతాయి.రక్త ప్రసరణ తగ్గటం: చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు, ఎముకలకు రక్తం అందటం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టటానికి బీజం పడినట్టే. కీళ్లు, కండరాలు కోలుకోవటమూ మందగిస్తుంది.విటమిన్ డి పడిపోవటం: శీతకాలంలో ఎండ కాయటం తగ్గుతుంది. ఒంటికి తగినంత ఎండ తగలకపోతే విటమిన్…
