…
Author: subhanih@gmail.com
ఫైనాన్షియల్ ప్లానింగ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మీ జీవితానికి ఒక భరోసా ఉండాలంటే తప్పకుండా ఏదో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అయితే వీటిలో చాలా రకాల పాలసీలు ఉంటాయి. సరైన పాలసీని ఎంచుకోవాలంటే ముందు మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.1. మీకు ఎంత కవరేజీ అవసరం?టర్మ్ ఇన్సూరెన్స్(term insurance) లో కేవలం ప్రొటెక్షన్ మాత్రమే లభిస్తుంది. పాలసీదారుడు టర్మ్ పూర్తయేవరకు జీవించి ఉంటే, మెచ్యూరిటీపై ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే అధిక కవరేజీ ఉన్నప్పటికీ, ప్రీమియం తక్కువగా ఉంటుంది. అందుకే మీ మొత్తం కవరేజీపై సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, అప్పులు, పెళ్లి లేదా ఇల్లు కొనుగోలు వంటి భవిష్యత్తు ప్లాన్స్ ను దృష్టిలో ఉంచుకుని కవరేజీని నిర్ణయించాలి. మీ వయసుని బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ కవరేజీ…
67 ఏళ్ల పదవీ విరమణ చేసిన రామకృష్ణకు.. తన జీవితంలో కష్టపడి సంపాదించిన పొదుపులను భద్రపరచుకోవడం ముఖ్యమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయనకు సేవింగ్స్‌గా రూ. 1.2 కోట్లు చేతికి వచ్చాయి. రిస్క్‌ను అస్సలు ఇష్టపడని ఆయన.. సంపూర్ణ భద్రత కోసం ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడి పెట్టాడు. బ్యాంకులో డబ్బు పెట్టడం అంటే ఎలాంటి ప్రమాదం లేదు.. వడ్డీ వస్తూనే ఉంటుంది. పింఛన్‌తో పాటు వడ్డీ కూడా వస్తే జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతుందని నమ్మాడు.అయితే కొద్ది రోజుల తరువాత ఆయన తన ఆర్థిక ప్రణాళికను పునఃసమీక్షించడానికి CA నితిన్ కౌశిక్‌ను కలిశాడు. రామకృష్ణ తన నిర్ణయం సరైనదని గర్వంగా చెప్పినప్పటికీ.. కౌశిక్ ఆయనకు ఒక వాస్తవాన్ని వివరించారు. అదే FDల భద్రత వెనుక దాగి ఉన్న ప్రమాదం. ఈ అంశాన్ని కౌశిక్ ఒక సరళమైన ఉదాహరణతో వివరించాడు.టైర్‌లో నెమ్మదిగా గాలి…
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందకుండా పోతున్నాయి. పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు ఆభరణాల కొనుగోలు చేయడం చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారంల మారింది. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు అసలు బంగారం కొనాలని అనుకున్న కలను వదిలేసి, ఇమిటేషన్ జ్యువెలరీ వైపు తిరుగుతున్నారు.చిలకలపూడి కేరాప్ గోల్డ్ : ఇలాంటి పరిస్థితుల మధ్య మచిలీపట్నంకు సమీపంలోని చిలకలపూడి దేశవ్యాప్తంగా బంగారానికి ప్రముఖ గమ్యస్థానంగా మారింది. ఎన్నో దశాబ్దాలుగా ఇమిటేషన్ జ్యువెలరీ తయారీలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, ఇప్పుడు బంగారం ధరల పెరుగుదలతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, గోల్డ్ ప్లేటెడ్ సెట్లు, నెక్లెస్‌లు, గాజులు, వంకీలు, ఉంగరాలు, పెళ్లికూతురు బ్రైడల్ సెట్లు..ఇలా అసలు బంగారాన్ని పోలిన మెరుపుతో దొరకుతున్నాయి, ఆకర్షణీయమైన డిజైన్లు, బరువులేకుండా తేలికగా ఉండటం వల్ల ఇవి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి…
మన దినచర్యలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు చూడటమే ఎక్కువైపోయింది. సగటున ఐదారు గంటలు స్క్రీన్ టైమ్ ఉంటోంది. దీనివల్ల కళ్ళు త్వరగా అలసిపోతున్నాయి, పొడిబారిపోతున్నాయి. ఒక్కోసారి చూపు మసకబారుతోంది. అందుకే కళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఇప్పుడు చాలా అవసరం. జూమింగ్ (Zooming) : ఎలా చేయాలి: ఇది దూరంలో ఉన్న ఒక వస్తువు లేదా పాయింట్‌ను చూసి, ఆ తర్వాత వెంటనే దగ్గర్లోని వస్తువు లేదా పాయింట్‌పై దష్టిని మార్చడం. ప్రయోజనాలు: ఇలా చాలాసార్లు చేయడం వల్ల కళ్ళకు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కు దష్టిని మార్చే సామర్థ్యం పెరుగుతుంది. ఇది దూరదష్టి (ప్రెస్బియోపియా), కళ్ళ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎవరికి ఉపయోగం: ఎక్కువసేపు స్క్రీన్ చూసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పెన్సిల్ పుష్-అప్స్ (Pencil Pushups)ఎలా చేయాలి: ఈ వ్యాయామంలో ఒక పెన్ను లేదా పెన్సిల్‌ను చేతి పొడవులో పట్టుకుని, ఆ తర్వాత నెమ్మదిగా ముక్కు దగ్గరకు…
నేడు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్న మహిళలు అధిక సంఖ్యలో వున్నారు. పీసీఓడీ తీవ్రతను ఎదుర్కోవటానికి మహిళలు తన ఆహారంలో చేయవలసిన కొన్ని నియమాలు పాటిస్తే ఇటువంటి సమస్యలు దరిచేరని నిపుణులు చెబుతున్నారు. పీసీఓడీ (పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్) అనేది స్త్రీ అండాశయాలు అపరిపక్వ గుడ్లను విడుదల చేసే పరిస్థితి. ఇది చివరికి సిస్ట్‌లుగా మారుతుంది. ఈ వ్యాధిని పూర్తిగా వదిలించుకోవడానికి మార్గం లేనప్పటికీ, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారపు అలవాట్లతో పాటు.. వ్యక్తిగత చికిత్స కూడా వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఈ సమస్య వల్ల చాలా మంది మహిళలకు గర్భదారణ సమస్యలు వస్తాయి. దీనికి సంబంధించి ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం. ఈ సమస్య ఉన్నవారు రెడ్ మీట్‌ను తీసుకోకూడదు. వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటమే కాదు, హార్మోన్ల అసమతుల్యతని కూడా పెంచుతాయి.ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పీసీఓడీతో బాధపడేవారు స్వీట్లను తీసుకోరాదు. తక్కువ…
శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు పెరుగుదల, హార్మోన్ల అసమతుల్యత వస్తాయి. ఇవి స్త్రీలలో అండాల విడుదలను ప్రభావితం చేస్తాయి. మన దేశంలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి రుగ్మతలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల మరింత తీవ్రతరం అవుతాయి. పురుషులలో తక్కువ టెస్టోస్టెరాన్ స్పెర్మ్ నాణ్యత, మొత్తం లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది.ఊబకాయం, జీవక్రియ రుగ్మతలుశారీరక నిశ్చలత్వం ఊబకాయానికి ప్రధాన కారణం. ఊబకాయం సంతానలేమికి ప్రమాద కారకమని నిరూపితమైంది. అధిక శరీర కొవ్వు లైంగిక హార్మోన్ల సమతుల్యతకు భంగం కలిగిస్తుంది, లిబిడోను తగ్గిస్తుంది, అండం, స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహం, ఇతర జీవక్రియ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, తద్వారా గర్భధారణ కష్టమవుతుంది.పెరిగిన ఒత్తిడినిశ్చల జీవనం రక్త ప్రసరణను తగ్గిస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఇది అండం, స్పెర్మ్ కణాలకు హాని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం యాంటీఆక్సిడెంట్ రక్షణను మెరుగుపరుస్తుంది,…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ వర్ధంతిని ‘మహాపరినిర్వాణ్ దివస్’గా జరుపుకుంటారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు కూడా ఇదే. దీనిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 6ను ‘శౌర్య దివస్’గా పాటించాలంటూ రాజస్థాన్ ప్రభుత్వం పాఠశాలలకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది.‘సత్యమేవ జయతే’ రూపంలో ధర్మం మన జాతీయ నినాదం. రాజ్యాంగ నైతికత మన దేశ నిర్మాణానికి దోహదపడుతుందని అంబేద్కర్ ఆశించారు. ‘విలువలు, నైతికత, అబద్ధమాడకపోవడం, అసత్యాన్ని నివారించడం’అనేవి ‘సత్యమేవ జయతే’నుంచే ఉద్భవించాయి- కేవలం ‘సత్యం’ మాత్రమే గెలుస్తుంది, మరేదీ కాదు.భారత రాజ్యాంగ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినప్పటికీ, ఉల్లంఘించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగానికి లేదు.రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949 నవంబర్ 26 భారత ప్రజలకు ఒక గొప్ప రోజు. పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు వంటి ముఖ్యమైన అంశాలు అప్పటి నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ అంబేడ్కర్ న్యాయపాలన…
ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేసే లెక్చరర్‌కు.. బ్యాంకు లోగో డీపీగా ఉన్న వాట్సప్ నంబరు నుంచి సందేశం వచ్చింది. మీ పాన్‌కార్డు అప్‌డేట్ చేయాల్సి ఉందన్నది దాని సారాంశం. అందులోని లింక్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇది నిజమేనని నమ్మి లింక్‌ను క్లిక్ చేసి.. అకౌంట్, మొబైల్ నంబరు, డెబిట్ కార్డు పిన్, గ్రిడ్ నెంబర్లు, పాన్ కార్డు వివరాలను నమోదుచేశారు. కొద్ది సేపటికే బ్యాంకు ఖాతాలో రూ.11 లక్షలు క్రెడిట్ అయినట్లు అతడి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఇంకాసేపట్లో రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.లక్ష చొప్పున డెబిట్ అయినట్లు సమాచారం వచ్చింది. ఆగమేఘాల మీద బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినట్లు, మంజూరు కాగానే.. ఆ మొత్తం వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు సిబ్బందిచెప్పారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువకుడికి ఇటీవల ఓ వ్యక్తి ఫోన్…
వారమంతా చదువులు, ఉద్యోగాలంటూ బిజీ జీవితాన్ని గడిపేస్తాం. వీకెండ్ వస్తే విశ్రాంతి పేరుతో సగం రోజు నిద్రకే పోతుంది. రోటిన్ పనులతో మిగతా రోజు పూర్తయిపోతుంది. మరుసటిరోజు నుంచి మళ్లీ పరుగు మొదలు. కళ్లు మూసి తెరిచేలోపు వీకెండ్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంది. చాలామందికి ఇలాగే ఉంటుంది. అయితే.. మనకంటూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి లభించే ఈ వారాంతాన్ని సంతోషంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడపడం అలవాటు చేసుకోవాలి.వీకెండ్ కదా అని.. మధ్యాహ్నం వరకు నిద్ర పోకుండా ఉదయాన్నే లేవండి. కిటికీలు, తలుపులు తెరిచి.. బయటి గాలిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేడివేడి కాఫీ, టీ తాగేస్తే శరీరం ఉత్తేజితమవుతుంది. ఫోన్‌లో మునిగిపోకుండా.. బాల్కనీలో/టెర్రస్‌పై ప్రశాంతంగా కూర్చొని మీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. వారంలో జరిగిన మంచి విషయాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకొని సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించాలి. ఇంట్లోనే వ్యాయామం చేసే బదులు ఈ రోజు నడుచుకుంటూ లేదా సైకిల్‌పై స్థానిక పార్క్‌కి…
ప్రేమ, వివాహబంధాలు మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ, కాలం గడుస్తున్నకొద్దీ .. భాగస్వామి ప్రవర్తనలో మార్పులు, లక్షణాలు ఇద్దరిలో మనస్పర్థలు తీసుకురావడమే కాదు.. వారి మధ్య దూరాన్నీ పెంచుతాయి. ముఖ్యంగా ఈ విషయాలే జంటల మధ్య గొడవలకు కారణమవుతాయని, అవే విడిపోయేవరకు తీసుకెళ్తాయని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అవేంటి.. వాటిని ఎలా అధిగమించి.. కలిసిఉండాలో తెలుసుకుందాం.చిన్నచూపుఏదైనా విషయం గురించి నలుగురిలో చర్చిస్తున్నప్పుడు.. నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడకు, నీకు సంబంధం లేని విషయం అంటూ భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలా చేసినప్పుడు వారు ఆత్మన్యూనతకు, అగౌరవానికి గురవుతారు. తరచూ అలాగే చేశారంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఏం చేయాలి?ఒకరినొకరు గౌరవించుకోవాలి. ముఖ్యంగా నలుగురిలో భాగస్వామిని అస్సలు అగౌరవపరచొద్దు. ఏదైనా విషయంపై విభేదిస్తే కూర్చొని శాంతంగా మాట్లాడుకోవాలి. తెలియని విషయాలుంటే అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగానీ, చెప్పినా అర్థం కాదులే అంటూ కసురుకోవద్దు.గతందంపతుల మధ్య వాగ్వాదం సాధారణమే. తరచూ జరుగుతూనే…
