…
Author: subhanih@gmail.com
సరస్ మేళా విజయం ప్రజలదేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సరస్ మేళా విజయవంతం కావడం పట్ల సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరులో సరస్ మేళా గొప్ప విజయవంతమైందన్నారు. ఎంత పెద్ద కార్యక్రమమైన విజయవంతం చేయగలమనే విశ్వాసం, నమ్మకం కలిగిందన్నారు. సరస్ లో 343 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసి రూ.25 కోట్లు పైగా విక్రయాలు చేశారని తెలిపారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం అన్నారు. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ కషి ఫలితంగా గుంటూరులో సరస్ జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8న ప్రారంభించారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, జాతీయ పేదరిక నిర్మూలన విభాగం అధికారులు మంచి సహకారాన్ని అందించారని చెప్పారు. గుంటూరు ప్రజలు విజయవంతం చేయడంలో గొప్ప భాగస్వామ్యం వహించారని ప్రశంసించారు.…
ఆరోగ్యం కోసం నడక – గుంటూరు కోసం నడక నినాదంతో ఈనెల 25న నిర్వహించనున్న 17వ గుంటూరు 10కే వాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం విద్యానగర్‌లోని ఎన్నారై ఇండియన్‌స్ప్రింగ్స్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో 10కే వాక్ బ్రోచర్ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ ఈనెల 15న ఉదయం 6.00 గంటలకు విద్యానగర్‌లోని ఇండియన్‌స్ప్రింగ్స్ పాఠశాల నుంచి ప్రారంభం కానున్న 10కే వాక్ అమరావతిరోడ్డు మీదుగా ఇన్నర్‌రింగ్ రోడ్డు, జేకేసీ కళాశాల మీదుగా తిరిగి పాఠశాలకు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటులు రాజేంద్రప్రసాద్, కామ్న జెఠ్మలానీ, జబర్ధస్త్ కమెడియన్లు ప్రత్యేక ఆకర్షణగా పాల్గొననున్నారని చెప్పారు. బ్రోచర్‌లో 10కే వాక్ మార్గం, పాల్గొనే వారిని వివిధ విభాగాలు విభజించిన వివరాలతో పాటు బహుమతుల వివరాలు పొందుపర్చినట్లు తెలిపారు. 10కే వాక్‌లో పాల్గొనేందుకు రూ.50 రుసుం చెల్లించిన వారికి టోపీ ఉచితంగా అందజేస్తామని,…
ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గుంటూరు అర్బన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సహాయకురాలు(ఆయా) పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సీడీపీఓ(ఎఫ్‌ఏసీ) సౌమ్య సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 5, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 5, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1 చొప్పున పోస్టులు ఉన్నాయన్నారు. అర్హులైన వారు ఈ నెల 27వ తేది సాయంత్రం 5 గంటలలోపు గుంటూరు అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయలంలో ధరఖాస్తులు అందజేయాలన్నారు.
దేశంలో వందేభారత్ స్లీపర్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో ఈ రైలు టికెట్లకు సంబంధించి రైల్వే మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైలు టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. సాధారణ రైళ్లలో చివరి 4 గంటల వరకు టికెట్ రద్దు చేసినా పాక్షికంగా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయి. వందేభారత్ స్లీపర్ రైలులో మాత్రం అలా కాదు. ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే టికెట్ రద్దు చేసినా ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వరు. ఈ మేరకు రైల్వే పాసింజర్స్ రూల్స్, 2015ను సవరించారు. వందేభారత్ స్లీపర్ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా.. 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. 72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ ధరలో 50% కోత…
గుంటూరు, జనవరి 19 : గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయని అన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించుటకు అందరు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సిఆర్ డిఎ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సూచించిన మేరకు శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు నీరు, పారిశుధ్యం పక్కా ఉండాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి,…
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే? దీని కోసం డాక్టర్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అంతా ఇచ్చే సలహా ఒకటే. రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవాలనే. నిజమే. ఎప్పుడైనా ఆలస్యంగా పడుకున్నా, త్వరగా లేచినా మర్నాడు నిరుత్సాహం, నీరసం ముంచుకొచ్చేస్తాయి. కానీ తగినంత నిద్రపోయినా అలసట వేధిస్తుంటే? తప్పకుండా ఆలోచించాల్సిందే. ఉదయం లేస్తూనే చిరాకు. మూడ్ ఏదోలా ఉంటుంది. ఏ పనిచేయాలన్నా బద్ధకం. దేని మీదా ఆసక్తి ఉండదు. అలాగని రాత్రంతా మెలకువగా ఉన్నామా అంటే అదీ లేదు. బాగానే నిద్రపోయాం. మరెందుకీ కునికిపాట్లు? మళ్లీ పడుకోవాలని ఎందుకనిపిస్తోంది? మగతగా ఎందుకుంటోంది? ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. రాత్రిపూట 7-8 గంటల సేపు నిద్రపోయినా మర్నాడు ఏదో తెలియని అలసట. దీనికి ప్రధాన కారణం గాఢ నిద్ర కొరవడటమే. అవును… ఎన్ని గంటలనేదే కాదు, ఎంత హాయిగా నిద్రపోయామన్నదీ ముఖ్యమే. 10-12 గంటల సేపు పడుకున్నా కూడా కంటి నిండా…
1. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరులో ఉన్న విధంగానే కేవలం ఒకే వ్యక్తికి వర్తిస్తుంది. ఈ కవర్‌ను మీతో పాటు మీ తల్లిదండ్రులు, పిల్లలు, భార్య మొదలయిన వారికి తీసుకోవచ్చు.ఈ ప్లాన్ కింద ప్రతీవ్యక్తి వేర్వేరు బీమా మొత్తాన్ని పొందుతారు. ఉదాహరణకు మీ బీమా మొత్తం విలువ రూ. 10 లక్షలు అయితే మీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ పాలసీ గడువులోగా రూ. 10 లక్షలు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు కనుక ముగ్గురు వ్యక్తుల కోసం రూ. 10 లక్షల బీమా మొత్తంతో ఇండివిజువల్ పాలసీని కొనుగోలు చేస్తే అప్పుడు మొత్తం బీమా మొత్తం విలువ రూ. 30 లక్షలు అవుతుంది.ఈ పాలసీలో ఉండే సెపరేట్ బీమా మొత్తం వలన మీ కుటుంబ సభ్యులకు ఒకేసారి ఏదైనా జరిగితే ఇది కవర్ చేస్తుంది.2. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ఇటువంటి పాలసీల్లో ఒక బీమా మొత్తం విలువ కుటుంబంలోని…
ప్రజలు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునేముందు కింది అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.1. ప్రయోజనాలు, బీమా మొత్తంఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు వయసు, మెడికల్ చరిత్రను చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా బీమా సంస్థ అందించే కవరేజీ ప్రయోజనాలను కూడా పరిశీలించాలి. అలాగే వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తనిఖీ చేయాలి.2. బీమా సంస్థ మార్కెట్ ఖ్యాతిఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది క్లెయిమ్ అమౌంట్‌కు సంబంధించినది కావున జాగ్రత్తలు తీసుకోవాలి.ఎటువంటి అవాంతరాలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు మీ ఇన్సూరెన్స్ కంపెనీ కింది షరతులను అనుసరిస్తుంది. 3. నెట్వర్క్ ఆస్పత్రులుఅధిక సంఖ్యలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉంటే నగదు రహిత క్లెయిమ్ బదిలీని నిర్ధారిస్తాయి. చికిత్సలో థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. అవాంతరాలు లేని చికిత్సను అందిస్తాయి.4. సాధారణ మెడికల్ చెకప్స్ప్రముఖ బీమా కంపెనీలు ప్రీ–యాన్యువల్ చెకప్స్‌ను వాటి పాలసీదారుల కోసం అందిస్తాయి. ఈ చెకప్స్ వలన వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.5.…
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రమాదాలు, అనారోగ్యం లేదా గాయాల కోసం అయిన ఆసుపత్రి ఖర్చులకు కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీలను నెలవారీ, వార్షిక కాలపరిమితులకు పొందొచ్చు లేదా పరిమిత కాలానికి పొందొచ్చు.మీరు బీమా చేసిన కాలానికి మీకు ఏదైనా ఆసుపత్రి ఖర్చు వస్తే ఆ ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది.మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు అవసరం?1.2016 నాటికి పురుషుల ఆయుర్దాయం 68.7 సంవత్సరాలు, స్త్రీలకు 70.2 సంవత్సరాలుగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 70, 75 సంవత్సరాలుగా ఉంది. 2. 2017లో భారతదేశంలో సంభవించిన మొత్తం మరణాల్లో 61 శాతం మరణాలు అసంక్రమిత వ్యాధుల వల్ల సంభవించాయి.3. 2017 నాటికి భారతదేశంలో 22.4 కోట్ల మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు.4. దాదాపు 7.3 కోట్ల మంది భారతీయులు టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 2025 నాటికి ఈ సంఖ్య…
మీ సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ.. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే సంపాదన అంతా ఆవిరైపోతుంది. అలాగే డబ్బు విషయంలో మీరు చేసే కొన్ని మిస్టేక్స్ మిమ్మల్ని ఆర్థింగా బలహీన పరచడమే కాక అప్పు చేసే స్థితికి తీసుకెళ్తాయి. అలాంటి కొన్ని బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.1. తప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలుచాలామంది మనీ-బ్యాక్ పాలసీలకు ఆకర్షితులయ్యి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ స్కీములు తీసుకుంటుంటారు. వీటివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇన్సూరెన్స్ పాలసీలు మంచివే అయినా.. వీటి విషయంలో జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక భద్రత ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ లు మాత్రమే తీసుకోవాలి.2. లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్చాలామంది తెలియకుండానే సంపాదనకు తగ్గట్టు లైఫ్ స్టైల్ ను మారుస్తుంటరు. అయితే కొన్నిసార్లు లిమిట్ దాటుతుంది. అవసరం లేకపోయినా కొత్త ఫోన్లు, పెద్ద కార్లు లేదా ఖరీదైన వస్తువుల కోసం అతిగా ఖర్చు చేస్తుంటారు. దీన్నే లైఫ్…
