…
Author: subhanih@gmail.com
– ఈనెల 29 వరకు వివిధ షిఫ్ట్‌లలో నిర్వహణ– ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలు– ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 వరకే అనుమతిఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2026 మొదటి సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు వివిధ షిఫ్ట్‌లలో జరగనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)లకు ఉమ్మడి గుంటూరుజిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 21,22,23,24,28వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్), 29న పేపర్–2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. అడ్మిట్‌కార్డులు పొందిన విద్యార్థులు పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పేపర్–2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30, మధ్యాహ్నం…
పట్టు వస్త్రాలతో ఎమ్మెల్యే నసీర్‌అహ్మాద్ స్థానిక ఆర్.అగ్రహారం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి మూలవిరాట్‌కి పంచామతాభిషేకం చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేపట్టగా, 108 మంది కన్యలతో ఊరేగింపు కొనసాగింది. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సమర్పించారు. దేవస్థాన ప్రాంగణంలో ఆధునికరించిన కార్యాలయపు గదిని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో 35 డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ ఈసీ సభ్యులు కొనకళ్ళ సత్యం, ఆలయ ఈవో నిడుమానూరు శ్రీనివాసులు, ఉత్సవ కమిటి చైర్మన్ కోటా శేషగిరిరావు, కమిటి కన్వీనర్లు, సలహాదారులు, సభ్యులు, గీత మందిరం చైర్మన్ జుజ్జురి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ టంగుటూరి అర్జునరావు పాల్గొన్నారు. తొలుత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
2025–26 రెండో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్నులు చెల్లించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో కోరారు. పన్నులను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లలో చెల్లించవచ్చన్నారు. నగర పాలకసంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్‌లు చెల్లించవచ్చన్నారు. బకాయిదార్లు మార్చి వరకు వేచి ఉండకుండా చెల్లించాలన్నారు. ఇప్పటికే వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు టార్గెట్‌లు విధించామన్నారు. వసూళ్ళపై సమీక్ష చేస్తామని, అవసరమైతే సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్ లైన్ ద్వారా cdma.ap.gov.in, పురమిత్ర యాప్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చన్నారు.
గుంటూరు నగరానికి కీలకమైన శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనుల్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పనులను యుద్ద ప్రాతిపదినక పూర్తి చేయనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి వీలుగా సైట్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన భాధ్యత నగరపాలక సంస్థపై ఉన్నందున, ఆ దిశగా అధికారులు తగిన కషి చేయాలన్నారు. కమిషనర్ మయూర్ అశోక్ తొలుత ఆర్‌ఓబి నిర్మాణ పరిధి, ఎన్ని భవనాలు ప్రభావితం అవుతున్నదీ, ఇప్పటి వరకు తొలగించినవి, కోర్ట్ కేసులు తదితర అంశాలను సమగ్రంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రాడీపేట వైపు పెండింగ్ లో ఉన్న పిల్లర్లలో ఒక పిల్లర్ నిర్మాణంకు సైట్ క్లియర్‌గా ఉన్నందున పనులు చేపట్టవచ్చన్నారు. అంగీకారం తెలిపిన భవనాలను తక్షణం తొలగించాలని, తెలపని వారితో మరోమారు వారి…
గణ తంత్ర దినోత్సవం సందర్బంగా∙ రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొనటానికి కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఎ.స్వాతికి ఆహ్వానం అందింది. ప్రకతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ 2016 నుంచి ప్రకతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల దేశీ వరి రకాలు భర్తతో కలిసి 20 ఎకరాలు సాగు చేస్తున్నారు. ప్రకతి వ్యవసాయ విధానాలు పూర్తిగా పాటిస్తూ ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడకుండా రసాయన రహిత వ్యవసాయం చేస్తున్న స్వాతికు అరుదైన గౌరవం లభించడం పట్ల జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారీయా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్టు అధికారి రాజకుమారి స్వాతిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ నేడు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, వాటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటాలు, ఉద్యమాల తీరుపై విస్తృతంగా చర్చ జరిగింది.ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తోందని గులాం రసూల్ ఈ సందర్భంగా వివరించారు. ప్రజా హక్కుల పరిరక్షణలో వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని, పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తిగా విన్నారు.అనంతరం ప్రజా సమస్యలపై వైసీపీ చేపడుతున్న ఉద్యమాలు, పోరాటాలను గులాం రసూల్ గారు ప్రశంసించారు. ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడటమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన…
–గుంటూరు జీజీహెచ్‌కు రూ.100 కోట్ల విరాళం–గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్ధుల దాతత్వం–పూర్వ వైద్య విద్యార్ధుల విరాళాలతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం– 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం– రూ. 20 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ ఉమా గవని– రూ. 10 కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిల ప్రసాద్–ఈనెల 30న సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి చదువు కున్న మాత సంస్థ రుణం తీర్చుకుంటూ సంస్థ అభివద్ధికి నిరంతరం అవిరళ కషి చేస్తున్నారు. ఆసంఘం పేరే జింకానా, గుంటూరు వైద్య కళాశాల లలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడి తాము చదువుకున్న కళాశాలను మరిచిపోకుండా అభివద్ధికి కషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా (జింకానా) 1981లో ఏర్పడింది.…
అవగాహన కల్పిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూ ఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయవాదులకు మధ్యవర్తిత్వం మీద 40 గంటల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు శిక్షణా తరగతులు జరుగనున్నాయి. కార్యక్రమానికి శిక్షకులుగా సుప్రీం కోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ కేరళ నుండి లాల్ వారియర్ అడ్వకేట్, మధ్యప్రదేశ్ నుండి మిస్ నీనా ఖరే అడ్వకేట్‌లను నియమించారు. ఐదు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు కార్యక్రమ ప్రారంభోత్సవంలో శిక్షకులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్‌లు జ్యోతి ప్రజ్వలనం…
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు మొక్కను అందిస్తున్న ఏఆర్ నూతన డీఎస్పీ సంకురయ్య జిల్లా ఏఆర్ డీఎస్పీగా కె.సంకురయ్య సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఏఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ ఆర్‌ఎస్‌ఐగా ఆయన విధుల్లో చేరారు. 2014లో ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొందగా అప్పటి నుంచి 2019 వరకు గుంటూరు రూరల్ జిల్లా ఆర్‌ఐగా విధులు నిర్వర్తించారు. 2019 నుంచి 2022 వరకు సిఏఆర్ విజయవాడలో విధులు నిర్వర్తించగా, 2022లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం నంద్యాల, విజయవాడ, అక్టోపస్ మంగళగిరిలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ గుంటూరు ఏఆర్ డీఎస్పీగా బదిలీయ్యారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు.
జిల్లాలో పీఎంఈవై ఇళ్ళ నిర్మాణాలకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అత్యదిక ప్రాధాన్యత ఇచ్చి పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయల సేవలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవో లు మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే–అవుట్లు లోని ఆప్షన్ 1, 2 లోని ఇళ్ళు నిర్మాణాలు ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాన్నారు. ఆప్షన్ 3 లో నిర్మించిన ఇళ్ళలో స్టేజ్, క్వాలిటీ డివియేషన్స్‌ను కాంట్రాక్టుతో వెంటనే సరిచేయించాలన్నారు. పీఎంఏవై 2.0 లో మంజూరు…
