…
Author: subhanih@gmail.com
-7 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు-వివరాలు వెల్లడించిన వెస్ట్ డిఎస్పీ అరవింద్–విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ కె.అరవింద్, అరండల్‌పేట సిఐ ద్విచక్రవాహనాలు చోరి చేసే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద చోరి చేసిన 7 ద్విచక్రవాహనాలను బుధవారం అరండల్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డిఎస్పీ కె.అరవింద్ వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 11వ తేదిన రాత్రి 7 గంటల సమయంలో అరండల్‌పేట 11/1వ లైన్‌లో రోడ్డు పక్కన చైతన్యపురి కాలనీకి చెందిన అవుతూ రవీంద్రరెడ్డి ద్విచక్రవాహానాన్ని పార్కింగ్ చేసి వెళ్ళి తిరిగి వచ్చి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల నగరంలోని పలు పార్కింగ్ సెంటర్‌ల వద్ద పరిశీలించగా ఎంతకు వాహనం కనిపించక పోవడంతో ఈనెల ఈనెల 18వ తేదిన అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై…
క్రేన్ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సంపత్‌నగర్‌లో జరిగిన ఆయన జన్మదిన వేడుకలకు పార్టీ నేతలు, కార్పొరేటర్‌లతో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇటు వ్యాపార కార్యకలాపాలతో పాటు అటు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో సదా సన్మార్గంలో నడిచే గొప్ప వ్యక్తి గ్రంధి కాంతారావు అని కొనియాడారు. ఆయన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. తండ్రి గ్రంధి సుబ్బారావు నుంచి స్వతహాగా అలవరుచుకున్న ఒక క్రమబద్ధమైన జీవనంతో అంచెలంచెలుగా ఎదిగి ఆజాత శత్రువులా మారారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, గీతా మందిరం ఛైర్మన్ వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు టీఎల్వీ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్, నవ్యాంధ్ర…
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల పురుష అభ్యర్థులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ-ఏర్పాట్లను పరిశీలిస్తున్న కల్నల్ రజత్‌సువర్ణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అధికారులు ఫిబ్రవరి 17 నుంచి 27వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణతో కలసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ నిర్వహిస్తారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా, సక్రమంగా చేయాలన్నారు. ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నల్ రజత్ సువర్ణ మాట్లాడుతూ ఫిబ్రవరిలో 17 నుంచి 27వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లరికల్, స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్ తదితర విభాగాలలో…
–యువత, విద్యార్ధులే లక్ష్యంగా విక్రయాలు – యాభై గ్రాముల ప్యాకెట్ రూ.800లు– సుమారు 4.2 కిలోలు స్వాధీనం.. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి కార్యకలాపాలు నిర్వహించే ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో ది. 21-01-2026న జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో టోల్‌ప్లాజా మధురానగర్‌లోని ఓ వెంచర్‌లో మంగళవారం మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తనఖీలు చేశారని అన్నారు. ఈ క్రమంలో పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దాసరి వినయ్‌బాబు (మంగళగిరి యర్రబాలెం), కొల్లిమర్ల లోకేష్ (నవులూరు), రామిదేని సాయికష్ణ (అంబటినగర్), తట్టుకోళ్ల దానియల్‌రాజు అలియాస్ బడాయి (పుల్లయ్యనగర్, కాజా), బండిరెడ్డి నంద్ (తాడేపల్లి), చిరుుబోయిన హరికష్ణ (కాజా), నల్లగొర్ల సాయితేజ (దుగ్గిరాల), మైనర్ (తాడేపల్లి) స్నేహితులని అన్నారు. వీరంతా గంజాయి,…
అంజిరెడ్డి భౌతికకాయంపై యూటీఎఫ్ పతాకాన్ని కప్పుతున్న రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కేఎస్ లక్ష్మణరావు, నాయకులు ఉపాధ్యాయ ఉద్యమంలో చివరి దాకా నిలబడి యూటీఎఫ్ ఆవిర్భావానికి క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమ నేత అంజిరెడ్డి మృతి ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్రమైన లోటు అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు అన్నారు. పెదకాకాని మండలం నంబూరులో విశ్రాంత ఉపాధ్యాయుడు, యూటీఎఫ్ ఉద్యమనేత టి. అంజిరెడ్డి (96) ది.21-01- 2026 న మృతి చెందారు. యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గ్రామంలోనే నివాసముంటూ, ప్రజాతంత్ర ఉద్యమాలకు సహకారాన్ని అందించారని, తద్వారా యువకుల్లో చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేసే వారని తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో పాటు యూటీఎఫ్ ఉద్యమ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ద్వారానే ప్రజలందరికీ విద్య, తద్వారా ప్రజా…
– ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక– జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు: 490– పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు: 27,260– జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు: 149 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు తదేక దీక్షతో సన్నద్దమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పరీక్షల్లో అధిక మార్కుల సాధన దిశగా వారిపై శ్రద్ద చూపిస్తున్నారు. గుంటూరుజిల్లాలోని 490 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్దమవుతున్న 27,260 మంది విద్యార్థుల కోసం 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.30…
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సమితి అధ్యక్షుడు, సభ్యులు బ్రాడీపేట బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న ఉచిత సామూహిక ఉపనయనములు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ బొప్పూడి శివరామకష్ణ ప్రసాద్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణులకు మాత్రమే అని చెప్పారు. బ్రాహ్మణ సేవా సమితిలో ఉపనయనముల కరపత్రముల ఆవిష్కరణ బుధవారం జరిగింది. ఉపనయనములు చేసుకోదలుచుకున్న వారు ఫిబ్రవరి 15వ తేదీ లోపు బ్రాహ్మణ సేవ సమితి ఆఫీసులో అప్లికేషన్ అందజేయాలన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు నందిరాజు పాండురంగారావు, ఉపాధ్యక్షులు వేదాంతం వెంకట వినోద్ కిరణ్, కార్యదర్శి రంగా వజ్జుల లక్ష్మీపతి, కోశాధికారి తుళ్లూరు ప్రకాష్, కో కన్వీనర్ ముక్కామల మారుతి రాంగోపాల్, సభ్యులు గొల్లపూడి రామకష్ణారావు, కర్లపాలెం బాలకష్ణ, కటక రాజు సాయిబాబా శర్మ, ఇంజనంపాటి సుబ్రహ్మణ్యం, దుర్భ ఫణిభూషణ్, తూటు పల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముసుగులో మహిళలను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న వైనంపై ఇరువురు బాధితులు పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.బాధితుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రేపల్లెకు చెందిన ఓ యువతి అతనికి దూరపు బంధువు కావడంతో శుభకార్యాలకు హాజరయ్యే సమయంలో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఆ యువతి డిగ్రీ చదువుకొని హైదరాబాద్‌లో ఉంటోంది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వారి పెళ్లికి అమ్మాయి పెద్దలు అంగీకరించకపోవడంతో 2019లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలు వారి పెళ్లిని సమ్మతించారు. ఆమె గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి పంపించాడు. తర్వాత నుంచి ఆమెను పట్టించుకోలేదు. అధిక కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. వారికి ఒక బాబు. అయినా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో అతనిపై పోలీసుస్టేషన్‌లో, కోర్టులో ఫిర్యాదు…
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కేఎస్ లక్ష్మణరావు, జేవీవీ ప్రతినిధులు జనవిజ్ఞానవేదిక, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 25న ఉదయం 10 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ‘‘భారత రాజ్యాంగం–సవాళ్ళు’’ సదస్సును విజయవంతం చేయాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు కోరారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సుంకర రాజేంద్రప్రసాద్, ప్రొఫెసర్ చక్కా బెనర్జీ, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక నాయకులు జి.వెంకట్రావు, టి.జాన్‌బాబు, బి.ప్రసాద్, టీఆర్ రమేష్, వీవీకే సురేష్, ఇ.అనిల్‌కుమార్, ఎస్‌ఎం సుభానీ, కె.ప్రేమ్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, గురవయ్య పాల్గొన్నారు,
ఎన్‌సీసీ కేడెట్ వేల్పుల రవి దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు టీజేపీఎస్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్‌సీసీ కేడెట్ వేల్పుల రవి పాల్గొనబోతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి తెలిపారు. పట్టాభిపురంలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కామేశ్వరశాస్త్రి మట్లాడుతూ కళాశాలలో అందిస్తున్న క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనతో విద్యార్థులు ప్రతి యేటా దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు వెళుతున్నారని అన్నారు. విద్యార్థుల్లో స్పత్ప్రవర్తన, నైతిక విలువలను పెంపొందించడంలో ఎన్‌సీసీ శిక్షణ దోహదం చేస్తుందని చెప్పారు. అదే విధంగా తమ కళాశాల ఎన్‌సీసీ అధికారి మేజర్ పి.కుమార్‌రాజా లక్షద్వీప్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంటిగ్రేషన్ శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎన్‌సీపీ కేడెట్ వేల్పుర రవితో పాటు మేజర్ కుమార్ రాజాను కళాశాల పాలకమండలి అధ్యక్షుడు పోలిశెట్టి శ్యామ్ సుందర్, కార్యదర్శి కేవీ బ్రహ్మం, అధ్యాపకులు అభినందించారు.
