…
Author: subhanih@gmail.com
గుంటూరు (23-01-2026 శుక్రవారం) :- స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరంలో అమరత్వం సాధించిన మహానాయకుడు అని, ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తి ఇస్తాయని జిల్లా కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం డి సాంబ్రాజ్యం, ఆర్టీవో శ్రీహరి , కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు
వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపరంగా వివిధ ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 14వేల సీసీటీవీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ప్రాజెక్టు, డాక్యుమెంట్ అప్‌లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ అంశాలపై ఏపీ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ముఖ్యంగా నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ట్రాఫిక్ ఉల్లంఘనలు తదితర వాటిని అదుపు చేసేందుకు చేసేందుకు సీసీటీవీ కెమెరాలను రియల్ టైం గవర్నెస్ కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య,…
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కు చెక్కు అందజేస్తున్న భాష్యం రామకష్ణ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీటీడీ నిత్యాన్నదానానికి భాష్యం విద్యా సంస్థల ఛైర్మన్ భాష్యం రామకష్ణ రూ.44 లక్షలు విరాళాన్ని అందజేశారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ను కలిసిన భాష్యం రామకష్ణ విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక రోజు అన్నదాన నిమిత్తం రూ.44 లక్షల విరాళాన్ని వితరణ చేశామని తెలిపారు.
జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రజల్లో కొంతమేర చైతన్యం వచ్చిందన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. సీనియర్ సిటిజిన్లకు వాట్సాప్ కాల్స్ చేసి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని, డబ్బులు డిపాజిట్ చేయాలని బెదిరిస్తుంటారని అన్నారు. అటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.అంతే గాక సీనియర్ సిటిజన్లకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు వాట్సాప్ కాల్స్ చేసి సీబీఐ పోలీసులమని చెబుతుంటారని అన్నారు. మొబైల్‌ఫోన్ల ద్వారా అశ్లీల ఫోటోలు పంపినట్లు కేసు నమోదైందని, పేరు తొలగింపునకు డబ్బులు డిపాజిట్ చేయాలని బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించాలని అన్నారు.…
స్థానిక రెడ్లబజార్ పొన్నూరు రోడ్‌లో వేంచేసిన శ్రీకనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ నిర్వాహాకులు అందించారు. కార్యక్రమంలో కమిటి అధ్యక్ష్య, ఉపాధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మద్దిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి మోరబోయిన నరసింహారావు, కోశాధికారి కల్లి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శులు మల్లం సత్యనారాయణ, అరవ ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపాటి మస్తాన్ రావు, పత్రి అప్పారావు, గోళ్ళ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Finish Setup విజేతలుగా నిలిచిన విద్యార్థులతో ప్రిన్సిపాల్ గోపీచంద్, నాగసుశీల, అధ్యాపకులు విద్యార్థులు భాషా పరిజ్ఞానంతో పాటు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలని జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ అన్నారు. జేకేసీ కళాశాల ఆంగ్లశాఖ ఆధ్వర్యంలో డమ్ షరాడ్స్‌పేరుతో రాష్ట్రస్థాయిలో సాఫ్ట్‌స్కిల్స్ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభినయం, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, భావ వ్యక్తీకరణ, గ్రహణశక్తి పెంపొందించుకోవడంలో ఇటువంటి పోటీలు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయన్నారు. భాషతో పాటు తెలుగు, ఆంగ్లంలో సామెతలు నేర్చుకోవడంలో పోటీలు దోహదం చేస్తాయన్నారు.కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్‌ను దూరం చేసి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడటంలో పోటీలు ఉపయోగపడతాయన్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకుని, సమాజంలోని వివిధ రంగాల్లో రాణించడంలో పోటీలు ఉపయోగపడతాయన్నారు. పోటీలకు కళాశాల ఆంగ్ల శాఖాధిపతి పి. నాగసుశీల కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించగా, న్యాయనిర్ణేతలుగా పి. గోపీచంద్, డాక్టర్ పాలప్రసాద్, కె.వీణ వ్యవహరించారు.…
ఈనెల 30,31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టి.టి.డి కళ్యాణ మండపంలో జరిగే ఎ.ఐ.కె.యస్ జాతీయ కౌల్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుండి జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్, వివిధ అంశాలపై సెమినార్స్, సాంస్కతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షలు, మాజీ ఎమ్.ఎల్.సి కె.యస్ లక్ష్మణరావు కోరారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముందుగా కార్యక్రమాలS కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో నగరంలోని టి.టి.డి కళ్యాణ మండపంలో ఎ.ఐ.కె.యస్. జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్, సెమినార్లు,సాంస్కతిక కార్యక్రమాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎగ్జిబిష¯ŒSలో వ్యవసాయ రంగానిక సంబంధించి సుమారు 100 వరకు స్టాల్స్ వుంటాయన్నారు. మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్ధుల నూతన…
గుంటూరు నగరంలో పారిశుద్ధ్య పనులను సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, ఇన్సె్పక్టర్లు భాధ్యతగా పర్యవేక్షణ చేయాలని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాల్సిందేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. జిటి రోడ్, శ్రీనివాసరావుపేట, శాంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్స్ వారీగా పారిశుద్ధ్య పనులు పిన్ పాయింట్ గా జరగాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, కార్యదర్శుల హాజరు ఉదయం 6 గంటలకు తమకు అందించాలని, త్వరలో హాజరు తప్పనిసరిగా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెయిన్ రోడ్లను ట్రాఫిక్ సమస్య లేకుండా ఉదయం 7 గంటలలోపే శుభ్రం చేయాలన్నారు. ఇళ్ల నుండే తడిపొడిగా వ్యర్ధాలు విభజన జరిగేలా అవగాహన కలిగించాలన్నారు. రోడ్లు, డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి, వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. పర్యటనలో ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్…
స్థానిక ఆర్‌అగ్రహారంలోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఈమేరకు విశేష కుంకుమపూజ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకుచెందిన మహిళ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి చైర్మన్ కోటా శేషగిరి, ఆర్యవైశ్య మహాసభ ఈసీ సభ్యులు కొనకళ్ల సత్యం, కాకుమాను శ్రీనివాసరావు, కారం శెట్టి లోకేష్, జూలూరి హేము, పి.కన్న పాల్గొన్నారు.
– ఈ నెల 30న జరిగే శాంతి ప్రదర్శనను జయప్రదం చేయండి– వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా పిలుపుసమావేశంలో మాట్లాడుతున్న నూరిఫాతిమా అంజుమన్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోయేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా స్పష్టం చేశారు. దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీన జరిగే భారీ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్ సీపీ ఈస్ట్ కార్యాలయంలో ముస్లీం మైనారిటీ నేతలు, పలు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ గుంటూరు అంజుమన్ సంస్థకు సంబందించి చినకాకానిలో ఉన్న 71.57 ఎకరాల భూమని లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందనానరు. ఐటీ పార్క్ నిర్మాణం పేరుతో భూములను దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో ముస్లీం మైనారిటీలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా దీనిపై పోరాడాల్సిన…
