…
Author: subhanih@gmail.com
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సే నో టూ డ్రగ్స్ వాక్ థాన్ గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘‘సే నో టు డ్రగ్స్’’ వాక్‌థాన్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించారు. వాక్‌థాన్ ఓరియన్ హోటల్, స్థంబాలగరువు నుంచి ప్రారంభమై ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో సిమ్స్, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్, ఎన్నారై కాలేజ్, చలపతి ఫార్మసీ కాలేజ్, వీవీఐటీ యూనివర్సిటీలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు, ఆరోగ్య సేవకులు, పోలీస్ సిబ్బంది, రోటరీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ…
గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పిల్లి మాణిక్యరావును రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ ఆధ్వర్యంలో టిడిపి మైనార్టీ సెల్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ మాట్లాడుతూ, పిల్లి మాణిక్యరావు వంటి అనుభవజ్ఞుడు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన, పార్టీ సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం కలిగిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని ప్రశంసించారు. గుంటూరు జిల్లా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంలో పిల్లి మాణిక్యరావు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే,…
ప్రజా స్వామ్యంలో ఏక్‌దిన్‌కా సుల్తాన్ అని పిలువబడేది ఓటరే. ఎలక్షన్ రోజున ఆయన దేశానికే రారాజు. అటువంటి రాజుగా భావించబడుతున్న ఓటరు 5 ఏళ్ళపాటు ప్రజాప్రతినిధిగా పనిచేసే వ్యక్తిని జాగ్రత్తగా ఎన్నుకోవలసి వుంటుంది.అభ్యర్థికి ఓటు వేసేటపుడు అతను ఇప్పటి వరకూ ఏం వెలగబెట్టాడో చూడండి. ఇప్పటిదాకా ఏంచేశాడో చూడండి. ప్రజాస్వామ్యాన్ని నిల బెట్టేందుకు ఓటును కచ్చితంగా వేయాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వారు కావాలి.ఎలక్షన్‌డేను హాలిడేగా భావించొద్దు1మీకు సంస్కారం వుంది. కాబట్టి చెప్పుతో కాదు కసితీరా ఓటుతో కొట్టు. డబ్బు, మద్యానికి బానిస కావద్దు. ఓటును అమ్ముకోవద్దు. ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందిఓటు హక్కు.. రాజ్యాగం కల్పించిన ఓ వరం.. 5ఏళ్ల మన భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం.. మన సంక్షేమాన్ని…
– ముఖ్యఅతిధులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు అంబటి, నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా గుంటూరు జిల్లాలోని చినకాకానిలో ఉన్న అంజుమన్ భూములు 71.57 ఎకరాలకు సంబందించి ఐటీ పార్క్ నిర్మాణానికి నోటిఫీకేషన్ జారీ చేసిన క్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముస్లీం మైనారిటీల భూములను కాజేసే ప్రయత్నం చేస్తోందన్నారు. దశాబ్దాల క్రితం దాతలు ముస్లీంలకు మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన భూములను ధారాదత్తం చేసే దిశగా కుట్రలు చేయటం సిగ్గుచేటన్నారు. ఇప్పటీకే దీనిపై ముస్లీం మైనారీటీల్లో ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ మైనారిటీలకు అండగా ఎంతటి పోరాటానికి వెనుకాడదన్నారు. నల్లచెరువులోని మసీదు వద్ద, తూర్పు నియోజకవర్గంలోని ఇక్బాల్ మసీదు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ…
గుంటూరు 23-01-2026 శుక్రవారం : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 24వ తేదీన నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవు. ఇక 26న రిపబ్లిక్ డే సందర్భగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కారణంగా 27న మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పటికైతే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపాయి. వరుసగా నాలుగు రోజులు అంటే లావాదేవీలు బాగా స్తంభించే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
గుంటూరు 23-01-2026 శుక్రవారం : శ్రీపంచమి సందర్భంగా బ్రాడీపేట శ్రీగౌరీశంకర నిలయంలో శ్రీభారతి సంగీతా నిలయంలో శుక్ర వారం సాయంత్రం సరస్వతి అమ్మవారిపై శ్రీసరస్వతి, సరసీరుహ అనేక కీర్తనలను వీణపై పలికించి నాదార్చన నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు వీణ విశారద భారతీదేవి ఆధ్వర్యంలో శిష్య బందం చేపట్టారు. తొలుత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తెల్లని పువ్వులతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శిష్య బందానికి తీర్ధ ప్రసాదాలు అందించారు.
సరస్వతీ కమిటీ స్కూల్లో చిన్నారులతో సుబ్బారావు, ఉపాధ్యాయులు –సీతారామ్‌నగర్‌లోని శ్రీసరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాఠశాలలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. పాఠశాల ప్రాంగణంలో కొలువైన శ్రీలక్ష్మి గణపతి, శ్రీసరస్వతీదేవి అమ్మవార్ల విగ్రహాలకు అర్చకస్వాములు పంచమి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డీవీ సుబ్బారావు చిన్నారులకు పలకలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వరలక్ష్మి, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం మానసవీణ, ఉపాధ్యాయులు అరుణకుమారి, జయరాం, నాగమేరి, సంగీత, శ్రీవిద్య పాల్గొన్నారు. జీకేఆర్ హైస్కూల్లో సరస్వతీపూజలో ప్రిన్సిపాల్ సుశీల, విద్యార్థినులు జీకేఆర్ హైస్కూల్ పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్‌లలో శుక్రవారం సరస్వతీపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో భక్తి,శ్రద్దలతో పూజలో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చదువుల తల్లి అనుగ్రహంతో విద్యార్థులు విద్యావంతులుగా, విజ్ఞానవంతులుగా ఎదగాలని అన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్…
విద్యార్థిని శ్రీలక్ష్మికి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తున్న రవీంద్రనాద్‌రెడ్డి గుంటూరు 23-01-2026 శుక్రవారం : విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి రంగోత్సవ్‌లో భాగంగా గుంటూరు రూరల్ మండలం పొత్తూరు జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె.లక్ష్మి చేతిరాత పోటీల్లో ప్రధమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈసందర్భంగా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.రవీంద్రనా«ద్‌రెడ్డి విద్యార్థిని శ్రీలక్ష్మికి జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహుకరించారు. ఈసందర్భంగా డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కష్ణ తులసి, ఉపాధ్యాయ బందం విద్యార్థినిని అభినందించారు.
భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డిస్తున్న భాష్యం రామకృష్ణ తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేసేందుకు రూ.44 లక్షలు విరాళంగా అందజేసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకష్ణ శుక్రవారం తిరుమలలోని శ్రీతరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. భాష్యం రామకష్ణతో పాటు భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
గుంటూరు – 23-01-2026 శుక్రవారం : తులసి సీడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తులసి యోగీష్ చంద్ర జన్మదిన వేడుకలు శనివారం అరండల్ పేటలోని యోగి భవన్ లో ఆఫీస్ సిబ్బంది, అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు ప్రముఖులు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, తోట రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, దాసరి వాసు, మిరియాల శ్రీనివాస్, బొక్కిసం శివరాం, దళావాయి సుబ్రహ్మణ్యం, పుచకాయల ఆనంద్, సుప్రీమ్ సర్జికల్స్ జవహర్ తదితరులు హాజరై అభినందనలు తెలియజేశారు. అభినందనలు అందజేసిన వారందరికీ శ్రీ యోగీష్ కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఎంతో కాలంగా తమ సంస్థలలో పనిచేస్తూ సంస్థలను ముందుకు నడిపిస్తున్న తులసీ ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని ఇందరి సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. దినదినాభివృద్ధి చెందుతున్న…
