Author: subhanih@gmail.com

గుంటూరు 26-01-2026 సోమవారం : పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ షాహినా బేగం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ షాహినా బేగం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను జీవితంలో ఆచరించినప్పుడే గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిజమైన అర్థం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలతో వేడుకలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు. చివరగా స్వీట్లు పంచి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమం లో ఆంధ్ర ముస్లిం కళాశాల కార్యవర్గ అధ్యక్షులు రహమాన్ ఇంకా…

Read More

లిఫ్టింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన గుర్రం స్వాతి గుంటూరు 24-01-2026 శనివారం : ఈనెల 18వ తేది నుంచి 21వ తేది వరకు శుభ్రత క్లాసిక్‌ నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ – నేషనల్‌ డెడ్‌ లిప్ట్‌ చాంపియన్‌ ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ వారు హరిద్వార్‌ లో నిర్వహించిన నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ లో గుంటూరు నగరం మల్లారెడ్డి నగర్‌ ప్రాంతానికి చెందిన గుర్రం స్వాతి బంగారు పతకాంను కైవసం చేసుకున్నారని, కోచ్‌ మెంటర్‌ నీలా యోబు శనివారం తెలిపారు. గుర్రం స్వాతి గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల ఇంటర్‌మీడియట్‌ ద్వితీయ సంవత్సం విధ్యాభాస్యం చేస్తుంది. అండర్‌ జూనియర్‌ 84 కేజీ విభాగం లో నేషనల్‌ రికార్డు బంగారు పతాకాన్ని పొందటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు నగరము పేరు జాతీయ స్థాయి లో ఖ్యాతి పొందటం ఆనందంగా ఉందని స్వాతి కుటుంబ సభ్యులు…

Read More

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌.ఖాజావలి, వివిధ మతాధికారులు గుంటూరు 24-01-2026 శనివారం : జాతీయ బాలికా దినోత్సవంను, బాల్య వివాహ ముక్తిభారత్‌ రెండవ విడత ప్రచార కార్యక్రమంను కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం వివిధ మతాలకు సంబంధించిన మతాధికారులకు బాల్య వివాహ నిరోధమునకు సంబంధించి అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిధిగా విఛ్చేసిన డిఆర్‌ఓ ఖాజావలి ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సంధర్భంగాఆయన మాట్లాడుతూ బాలికల విద్య పట్ల అందరూ శ్రద్ధ పెట్టాలని, మన జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, బాల్య వివాహాలు జరిగినచో సంబంధిత వ్యక్తులందరిపై చర్య తీసుకుంటారని తెలిపారు. జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి పి పి జి ప్రసూన మాట్లాడుతూ 181, 1098 టోల్‌ ఫ్రీ నెంబర్స్‌ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, మహిళాభివద్ధి మరియు సంక్షేమ శాఖ, బాలలు, స్త్రీల రక్షణకు…

Read More

గుంటూరు 24-01-2026 శనివారం : ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పకడ్బంధీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్‌ విద్య ఆర్జేడీ జె.పద్మ పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో ప్రిన్సిపాల్స్, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లకు ఓరియెంటేషన్‌ కల్పించారు. ఈసందర్భంగా ఆర్జేడీ పద్మ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటి నుంచి 10 వరకు రెండు స్పెల్స్‌లో జరగనున్న జనరల్‌ ప్రాక్టికల్స్‌కు జిల్లాలోని 126 కేంద్రాల పరిధిలో 27,960 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఫిబ్రవరి 10 నుంచి 3వ స్పెల్‌లో 17 కేంద్రాల్లో పరిధిలో 2,292 మంది హాజరుకానున్నారని వివరించారు.పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలను విధిగా ఏర్పాటు చేయాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. ఆర్‌ఐవో జి.సునీత మాట్లాడుతూ విద్యార్థుల హాల్‌టిక్కెట్లను ఇంటర్మీడియెట్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందజేయాలని ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. అదే విధంగా విద్యార్థులు మనమిత్ర వాట్సప్‌ నంబరు 95523 00009 కు…

Read More

గుంటూరు 24-01-2026 శనివారం : వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఈనెల 22,23,24వ తేదీల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ సమ్మిట్‌ పోటీల్లో లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాల తరపున ప్రదర్శించిన ప్రాజెక్టు ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్‌ పాటిబండ్ల విష్ణువర్ధన్‌ శనివారం ఓప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 88 స్పేస్‌ ఎగ్జిబిట్స్‌లో తమ పాఠశాల నుంచి 6,7వ తరగతుల విద్యార్థులు ఇ. సుహ్రీత శ్రీ, ఎస్‌కే రెహాన్, ఎన్‌. జీవిక, ఎం. దేదీప్య రూపొందించిన ప్రాజెక్టు ద్వితీయ స్థానంలో నిలిచి, రూ.10వేలS నగదు పురస్కారాన్ని విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు సజనాత్మకత, ఆత్మవిశ్వాసాలను చాటుకున్నారని, ఏదైనా సాధించాలనే తపనే వారి విజయానికి కారణమని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్‌ టీచర్లు డి. శోభారాణి, కె.…

Read More

మాట్లాడుతున్న ఆర్జేడీ డాక్టర్‌ కళావతి గుంటూరు 24-01-2026 శనివారం : ఎనిమిది దశాబ్ధాలకు పైగా సుదీర్ఘ చరిత కలిగిన ప్రభుత్వ మహిళా కళాశాల విద్యా ప్రమాణాల్లో అగ్రస్ధానంలో నిలిచిందని కళాశాల విద్య ఆర్జేడీ డాక్టర్‌ పి. కళావతి అన్నారు. శనివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల లేడీ హోప్‌ అల్యూమ్నీ అసోసియేషన్‌ రజతోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆర్జేడీ కళావతి మాట్లాడుతూ కోస్తాంధ్రలోనే మొదటి మహిళా కళాశాలగా గుర్తింపు పొందిన మహిళా కళాశాల ప్రగతిలో పూర్వ విద్యార్థినుల సంఘ కషి ఎంతో ఉందన్నారు. గుంటూరు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్వీ సుందరాచారి మాట్లాడుతూ కళాశాల గౌరవ ప్రతిష్టలకు పూర్వ విద్యార్థినులే పతాకాలుగా ఉంటారని చెప్పారు. గుంటూరు మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు అందించిన కోట్ల రూపాయల వితరణతో అత్యున్నత ప్రమాణాలతో కళాశాలను తీర్చిదిద్ది పూర్వవైభవాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు సామాజిక మాధ్యమాలకు దూరంగా…

Read More

కరపత్రాలను అందజేస్తున్న నూరిఫాతిమా, గులాం రసూల్‌ తదితరులు గుంటూరు 24-01-2026 శనివారం : అంజుమన్‌ భూముల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా స్పష్టం చేశారు. చినకాకానిలో అంజుమన్‌ భూములను ఐటీ పార్క్‌ నిర్మాణం నిమిత్తం నోటీఫీకేషన్‌ జారీ చేసిన నేపధ్యంలో శనివారం నియోజకవర్గంలోని 15వ డివిజన్‌ హుస్సేన్‌నగర్‌లో “ఇంటింటికీ తిరిగి సంతకాల సేకరణ” కార్యక్రమం నిర్వహించారు. కరపత్రాలను అందజేసి, భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు.ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ అంజుమన్‌ భూములను ధారదత్తం చేసే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మసీదుల వద్ద చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ముస్లీం మైనారిటీల చట్టాలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 30న గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా…

Read More

– అవయవదానంతో నూతన జీవితాలు ప్రసాదించారు– కిమ్స్‌ శిఖరలో విజయవంతంగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ – లివర్‌ ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికితో ఆపరేషన్‌ ప్రక్రియలో పాల్గొన్న వైద్య బందం గుంటూరు 24-01-2026 శనివారం : బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోతున్న ఇరువురు వద్ధులు అవయవదానంతో ఇరువురికి నూతన జీవితాలు ప్రసాదించారు. గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇరువురు రోగులకు లివర్‌ మార్పిడి ఆపరేషన్లు చేసి జీవితాలను ప్రసాదించారు.వివరాల్లోకి వెళితే కష్ణా జిల్లాకు చెందిన సి.హెచ్‌.సుబ్బలక్ష్మి (61) గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో ఈనెల 8న అనారోగ్యం బారిన పడి చేరి, ఈనెల 10న బ్రెయిన్‌ డెడ్‌ అయింది. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన కడియం నాగమల్లేశ్వరి (60) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 8న గుంటూరు కిమ్స్‌ శిఖర హాస్పటల్‌లో చేరింది. చికిత్సపొందుతూ ఈనెల 11న బ్రెయిన్‌ డెడ్‌ అవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు…

Read More

గుంటూరు 24-01-2026 శనివారం : కేర్‌ దంత వైద్య కళాశాలను ఎన్‌.టీ.ఆర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పుల్లల చంద్రశేఖర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చంద్రశేఖర్‌ వైద్యులు నిరంతర పరిశోధనల ద్వారా, నూతన ఆవిష్కరణల ద్వారా మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించగలరన్నారు. వెద్య విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కేర్‌ దంత వైద్య కళాశాల వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ రసూల్‌ సయ్యిద్‌ మాట్లాడుతు విశ్వవిద్యాలయ పరీక్షలను కట్టుదిట్టంగ నిర్వహించడలో చంద్రశేఖర్‌ చొరవ ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో కేర్‌ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్, ఓరల్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ మెహబూబ్, ఓరల్‌ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సురేష్, మెడిసిన్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ స్మిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

మార్కెట్‌ లో ఊడుస్తున్న మేయర్‌ రవీంద్ర, కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరు నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్‌ పరిసర ప్రాంతాల మాస్‌ క్లీనింగ్, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు ఉన్న టాయ్‌ లెట్స్‌ ను నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ తో కలిసి మేయర్‌ పరిశీలించి తదుపరి విజ్ఞాన మందిరం వద్ద అధికారులు సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుద్ధ్య లోపాల వలన కలరా వంటి అంటు వ్యాధులు రాకుండా నగరంలో ఎప్పటికప్పడు గార్బేజ్‌ కలెక్షన్, డ్రైన్స్‌ క్లీనింగ్, పత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర…

Read More