Author: subhanih@gmail.com

గుంటూరు ది. 02-02-2026 సోమవారం :నగరంలోని శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, శ్రీజగన్నాధస్వామి వారి దేవస్థానం (కొత్తపేట), శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (లాలాపేట)లో శ్రీ స్వామి వార్ల హుండీలను సోమవారం లెక్కించారు. మూడు దేవస్థానాల ఈవో టి.సుభధ్ర, శారదానికేతన్‌ ఈవో టి.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో శ్రీభూమా వీర వెంకటభాపారావు (ఆర్‌ఎస్‌ఎల్‌) నారాయణ రోరవల్‌ కూర్‌ సభ్యుల సహకారంతో లెక్కింపు చేపట్టారు. శ్రీజగన్నాధస్వామి వారి దేవస్థానం హుండీ రూ.16,106, శ్రీఆంజనేయస్వామి వారి దేవస్థానం హుండీ రూ. 3.76 లక్షలు, శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం రూ.5.77 లక్షలు వచ్చాయని ఈవో సుభద్ర తెలిపారు. మూడు దేవస్థానాలకు మూడు నెలల పదిహేను రోజులకు రూ.9.70 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. పది దుబాయ్‌ డాలర్లు, 33 అమెరికా డాలర్లు, 28 గ్రాముల బంగారం, 918 గ్రాముల వెండి వస్తువులు కానుకల రూపంలో హుండీల ద్వారా వచ్చాయని పేర్కొన్నారు. లెక్కింపులో నారాయణ రోరవల్‌ కూర్‌ సభ్యులు, దేవస్థానాల సిబ్బంది…

Read More

గుంటూరు ది. 02-02-2026 సోమవారం :కేంద్రంలో నరేంద్ర మోడీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలకోసం కాకుండా, కొందరు పెద్ద వర్గాల లాభం కోసం మాత్రమే రూపొందించబడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలను విస్మరించడం, ఇప్పటికే కూనారీలుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత పతనంలోకి నెట్టడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యం అయి ఉందన్నారు. రూపాయి పతనం, వ్యాపారాల నష్టాలు, పౌరుల వినిమయ శక్తిలో కోతలు – ఇవన్నీ ఈ బడ్జెట్‌ ప్రభావంలో పెరుగుతాయని సూచించారు. దేశ భవిష్యత్తును కాపాడే కనీస ఆలోచన లేకుండా నిర్మలా సీతారామన్‌ గారు బడ్జెట్‌ ప్రవేశపెట్టారన్నారు. గ్రామీణ రైతులు, వ్యవసాయ కార్మికులు ఇప్పటికే అభివద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిలో, ఈ బడ్జెట్‌ రైతులకు…

Read More

– 30 ఏళ్ల తరువాత ఎగ్జిబిషన్‌ ఏర్పాటు – మెడికల్‌ ఎగ్జిబిషన్‌లో 40 స్టాల్స్‌ ఏర్పాటు – మానవ శరీర అవయవాలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు – ఆపరేషన్లు సైతం నేరుగా చూడవచ్చు మీ పిల్లలు డాక్టర్లు కావాలని మీరు కోరుకుంటున్నారా.. అయితే వారిని మెడికల్‌ ఎగ్జిబిషన్‌కు తీసుకురండి. మీరు వైద్య వత్తి గురించి చెప్పేదానికంటే నేరుగా మీ పిల్లలు చూస్తే వారికే వత్తిపట్ల ఆసక్తివస్తుంది. గర్భిణీ ఒక బిడ్డకు జన్మనిచ్చేందుకు ఎంత కష్ట పడుతుందో…. సదరు బిడ్డను భూమిపైకి తెచ్చి ఊపిరి పోసేందుకు వైద్యులు ఎంత కష్టపడతారో కళ్లకు కట్టినట్లు మీరు నేరుగా చూడాలకుంటన్నారా…. అయితే గుంటూరు వైద్య కళాశాలకు రండి. గుప్పెడంత గుండె ఏ రంగులో ఉంటుంది…. లబ్‌డబ్‌ మంటూ ఎలా కొట్టుకుంటుంది… గుండెకు ఏలా చికిత్స అందిస్తారు అనే విషయాలను నేరుగా చూడాలనుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుంటూరు వైద్య కళాశాలకు రండి. ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తు…

Read More

గుంటూరు ది. 02-02-2026 సోమవారం : గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ వద్ద ఆదివారం ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ శిబిరంలో గుండె, రక్తపోటు, మధుమేహం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించి సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి, వైద్యుల సూచనలతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకిఫ్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవడం…

Read More

గుంటూరు 28-01-2026 బుధవారం :- జిల్లాలో రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మరింతగా మెరుగుపరిచేలా తహసిల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ అధికారుల వర్క్ షాప్ లో జిల్లా  కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఇటీవల అనేక సర్కూలర్స్ జారీ చేసిందన్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న కొన్ని రకాల భూములు తొలగింపుకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీవో, తహసిల్దార్ స్థాయిలోనే దరఖాస్తులు పరిష్కారించటానికి అవకాశం కల్పించారన్నారు. క్షేత్రస్థాయిలోని అధికారులు సక్రమంగా విచారణ ద్వారానే రెవెన్యూ సమస్యలు ఎక్కువ…

Read More

గుంటూరు 28-01-2026 బుధవారం : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీ.జీ.హెచ్)లో గుంటూరు మెడికల్ కాలేజీ ఆలూమినీ ఆఫ్ నార్త్ అమెరికా (జింకానా) సౌబ్రాతృత్వంతో నిర్మించిన కానూరి – జింకానా మాతాశిశు సంరక్షణ భవనంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన ప్రారంభించనున్నారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించుటకు అన్ని పనులు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ బుధవారం జి.జి.హెచ్ లో ఎం.సి.హెచ్ బ్లాక్ ను తనిఖీ చేశారు. బందోబస్తు, ట్రాఫిక్, పారిశుధ్యం తదితర అంశాలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఆయా విభాగాల్లో పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జి.జి.హెచ్ సూపరింటెండెంట్ డా.ఎస్.ఎస్.వి.రమణ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, డి.ఎస్.పి అజీజ్, జింకానా ప్రతినిధులు బాబుల్ రెడ్డి, రామ…

Read More

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అపూర్వ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమైనవన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ వంటి పది ముఖ్య సూత్రాలను దష్టిలో ఉంచుకొని, రాబోయే ఐదు సంవత్సరాలలో 15 శాతం కంటే ఎక్కువ జీఎస్‌డీపీ వద్ది రేటుతో జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలను వ్యర్థ రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్షా్యన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 42,575 ఫిర్యాదులు స్వీకరించగా 39,742 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని, రెవిన్యూ క్లినిక్‌ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చి…

Read More

భారత దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన నాయకుల స్పూర్తితో గుంటూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, అభివద్ధి పనులు చేపట్టడానికి కషి చేస్తామని నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నగర మేయర్‌ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజిలాలతో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరణ, హిమని సెంటర్‌ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి, జిఎంసి ప్రధాన కార్యాలయంలో బాబు రాజేంద్ర ప్రసాద్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి, విధుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులు, కార్మికులు, సచివాలయ కార్యదర్శులకు ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, 1947 ఆగస్ట్‌ లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చి దేశం…

Read More

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఆమె కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిన రోజు గణతంత్ర దినోత్సవమన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతత్వంలో రూపొందిన రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. దేశ స్వాతంత్య్రాన్ని సాధించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత మనందరిదని గుర్తించాలన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగితేనే భారతదేశం మరింత గొప్పగా ఎదుగుతుందన్నారు.

Read More