
ప్రజలు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునేముందు కింది అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
1. ప్రయోజనాలు, బీమా మొత్తం
ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే ముందు వయసు, మెడికల్ చరిత్రను చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా బీమా సంస్థ అందించే కవరేజీ ప్రయోజనాలను కూడా పరిశీలించాలి. అలాగే వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తనిఖీ చేయాలి.
2. బీమా సంస్థ మార్కెట్ ఖ్యాతి
ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది క్లెయిమ్ అమౌంట్‌కు సంబంధించినది కావున జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎటువంటి అవాంతరాలు లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు మీ ఇన్సూరెన్స్ కంపెనీ కింది షరతులను అనుసరిస్తుంది.
- హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో – క్లెయిమ్స్ కోసం ఎంత మంది వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే.. వారిలో ఎంత మంది విజయవంతంగా క్లెయిమ్స్ పొందారనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వారు ఎంత శాతం అమౌంట్‌ను పొందారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.
- నిర్వహణలో ఉన్న ఆస్తులు – ఇది సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత మంది పాలసీలు తీసుకున్నారనే విషయాన్ని, అందులో ఎంత నిధులు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. అందరు పాలసీ దారుల నుంచి సేకరించిన ప్రీమియం అమౌంట్స్ మేనేజ్మెంట్ కింద ఉన్న ఆస్తులుగా (నిర్వహణలో ఉన్న ఆస్తులు) పరిగణించబడతాయి. అధిక AUM విలువ సదరు బీమా కంపెనీ నుంచి అనేక మంది పాలసీలు తీసుకున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. మార్కెట్లోని దాని కీర్తిని ప్రతిబింబిస్తుంది.
- సాల్వెన్సీ రేషియో – పలు క్లెయిమ్స్‌ను ఒకే సమయంలో లేవనెత్తితే స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో కంపెనీ తన బాధ్యతలను ఎలా తీర్చుతుందనే విషయాన్ని ఇది సూచిస్తుంది. ఎక్కువ సాల్వెన్సీ రేషియో ఉంటే కంపెనీ మంచి మేనేజ్మెంట్ను సూచిస్తుంది. ఎందుకంటే మేనేజ్ చేసే ఆస్తుల విలువ క్లెయిమ్స్ విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.
- ఎన్నేళ్లుగా వ్యాపారంలో ఉంది – ఇది బీమా సంస్థ అనుభవం, క్లెయిమ్ సెటిల్మెంట్ ఇంకా నిధుల పంపిణీ విధానం గురించి చర్చిస్తుంది.
3. నెట్వర్క్ ఆస్పత్రులు
అధిక సంఖ్యలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉంటే నగదు రహిత క్లెయిమ్ బదిలీని నిర్ధారిస్తాయి. చికిత్సలో థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. అవాంతరాలు లేని చికిత్సను అందిస్తాయి.
4. సాధారణ మెడికల్ చెకప్స్
ప్రముఖ బీమా కంపెనీలు ప్రీ–యాన్యువల్ చెకప్స్‌ను వాటి పాలసీదారుల కోసం అందిస్తాయి. ఈ చెకప్స్ వలన వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.
5. రెన్యూవబులిటీ
ఏ బీమా పాలసీలలో అయితే జీవితాంతం రెన్యూవబులిటీ ఆప్షన్ ఉంటుందో అటువంటి వాటిని ఎంచుకోండి. ఈ సౌలభ్యం వలన వ్యక్తులు ఎటువంటి పరిస్థితిలో అయినా ఆర్థికంగా భద్రంగా ఉంటారు. కంపెనీలు స్థిరమైన ప్రీమియంలను కలిగి ఉంటాయి.
మీరు ఈ పాయింట్లను అనుసరించడం వలన మీకు సరిపోయే హెల్త్ పాలసీని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది. నామమాత్రపు ప్రీమియం చార్జీలతో హెల్త్ పాలసీని తీసుకోవడం వలన మీ జీవితంలో హెల్త్ ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఇది చూస్తుంది.
చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో ఒకే ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటారు. సమయం ప్రకారం ఆ ప్లాన్‌ను పునరుద్ధరించుకుంటూ ఉంటారు. సరైన ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం
