
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రమాదాలు, అనారోగ్యం లేదా గాయాల కోసం అయిన ఆసుపత్రి ఖర్చులకు కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీలను నెలవారీ, వార్షిక కాలపరిమితులకు పొందొచ్చు లేదా పరిమిత కాలానికి పొందొచ్చు.
మీరు బీమా చేసిన కాలానికి మీకు ఏదైనా ఆసుపత్రి ఖర్చు వస్తే ఆ ఖర్చులను బీమా సంస్థ భరిస్తుంది.
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు అవసరం?
1.2016 నాటికి పురుషుల ఆయుర్దాయం 68.7 సంవత్సరాలు, స్త్రీలకు 70.2 సంవత్సరాలుగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 70, 75 సంవత్సరాలుగా ఉంది.
2. 2017లో భారతదేశంలో సంభవించిన మొత్తం మరణాల్లో 61 శాతం మరణాలు అసంక్రమిత వ్యాధుల వల్ల సంభవించాయి.
3. 2017 నాటికి భారతదేశంలో 22.4 కోట్ల మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు.
4. దాదాపు 7.3 కోట్ల మంది భారతీయులు టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 2025 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఈ గణాంకాలను బట్టి చూస్తే భవిష్యత్తులో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు అర్థమవుతున్నాయి. ఇటువంటి వ్యాధులకు అయ్యే ఖర్చులను కవర్ చేసేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
2030 నాటికి భారతదేశం ఆరోగ్య సంరక్షణ మార్కెట్ విలువ $1000 బిలియన్ డాలర్లుగా ఉండనుందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వైద్య ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ఇది ప్రతిబింబిస్తుంది.
ఇలా ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో హెల్త్ ఇన్సూరెన్స్‌ల ప్రాముఖ్యత పెరిగిపోయింది. పాలసీదారులు చేసే క్రమానుగత ప్రీమియం చెల్లింపులను బట్టి ఈ పాలసీలు హెల్త్ కేర్ ఖర్చుల విషయంలో కాంప్రహెన్సివ్ కవరేజీని అందిస్తాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల వలన ప్రయోజనాలు ఏమిటి?
1. హాస్పిటలైజేషన్ ఖర్చులు
అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కవర్ చేస్తాయి. ఏదేమైనా ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులో లేకుంటే.. ఇంతకు ముందే వ్యాధి నిర్ధారణ కాకపోతే క్లెయిమ్స్ కేవలం ఉపేక్షించబడతాయి.
కింది పరిస్థితులలో ఆసుపత్రిలో చేరే ఖర్చులు కూడా ప్రసిద్ధ బీమా సంస్థలచే పొడిగించబడతాయి.
*తీవ్రమైన అనారోగ్య సమస్యలకు చికిత్స – కొన్ని బీమా సంస్థలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు చికిత్స కొరకు బీమా మొత్తం విలువను పెంచుతాయి. ఆసుపత్రిలో చేరడం, రోగ నిర్ధారణ, చికిత్సా ఖర్చులు మొదలయిన వంటి వాటిని చాలా బీమా కంపెనీలు కవర్ చేస్తాయి.
*ప్రమాదాలు, అనారోగ్య సంబంధిత హాస్పిటలైజేషన్ కవరేజ్- అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చేరితే ఎదురయ్యే వైద్య ఖర్చులు కూడా కవర్ అవుతాయి. వైద్య ఖర్చులు బీమా మొత్తం విలువ కంటే ఎక్కువ అయినా కూడా మేజర్ బీమా కంపెనీలు కవర్ చేస్తాయి. ఈ కవరేజ్ మిమ్మల్ని ఆర్థికంగా సంరక్షిస్తుంది. అనుకోని సందర్భాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.
2. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ చార్జీలు
రోగ నిర్ధారణ ఖర్చులు, ఆసుపత్రిలో చేరే ముందు అయ్యే ఖర్చులను, డాక్టర్ ఫీజులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
అంతేకాకుండా మెడికేషన్, సాధారణ చెకప్స్, ఇంజెక్షన్స్ వంటి పోస్ట్ రిలీజ్ ఖర్చులను కూడా చాలా బీమా కంపెనీలు భరిస్తాయి. మీకు పరిహారం మొత్తం అనేది ఒకేసారి పెద్దమొత్తంగా రావొచ్చు లేదా సంబంధిత బిల్లులను సమర్పించడం వల్ల రావొచ్చు.
3. ఐసీయూ (ICU) రూమ్ రెంట్
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఐసీయూ (ICU) పడకల చార్జీలను కూడా కవర్ చేస్తాయి. బీమా చేసిన వ్యక్తి తనకు నచ్చిన రూమ్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఈ రూమ్ బిల్లులు అన్నీ బీమా కంపెనీకి పంపబడతాయి. నిర్దిష్ట మొత్తంగా లేదా పూర్తి బీమా మొత్తంగా ఇవి పరిగణించబడతాయి.
4. మానసిక సమస్యలకు కవరేజీ
మానసిక సమస్యలకు ఆసుపత్రిలో చేరినా కూడా ఈ పాలసీలో కవర్ చేయబడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఈ సౌలభ్యం ద్వారా పాలసీదారులు నిపుణుల సాయం తీసుకుని చక్కని జీవితాన్ని పొందేందుకు సహాయపడుతుంది.
5. బేరియాట్రిక్ సర్జరీ ఖర్చులు
ఊబకాయం సమస్యలతో సర్జరీ చేసుకునే వారి వైద్య ఖర్చులను భరించేందుకు కేవలం కొన్ని బీమా కంపెనీలు మాత్రమే అంగీకరిస్తాయి. అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహం వంటి సమస్యలకు స్థూలకాయం ఒక కారణం. కాబట్టి ఇది పాలసీదారులు భవిష్యత్‌లో ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉండే ఈ ఫీచర్లు అన్ని వైద్య ఖర్చులను తీర్చడంలో సాయం చేస్తాయి. దీనికి ప్రీమియం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రముఖ బీమా కంపెనీలు అధిక కవరేజ్ రూపంలో ప్రయోజనాలను అందిస్తాయి.
6. రూమ్ రెంట్
ఆసుపత్రులలోని రూమ్ రెంట్ కూడా ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది. బీమా చేయబడిన వ్యక్తి కోలుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి సందర్భాలలో పంపిణీ చేయబడే మొత్తం అమౌంట్‌ను బీమా కంపెనీ ముందుగా నిర్ణయిస్తుంది.
7. డేకేర్ ప్రొసీజర్లు
డయాలసిస్, క్యాటరాక్ట్, ట్రాన్సిలెక్టమీ వంటి డేకేర్ చికిత్సలకు అయ్యే ఖర్చులను చాలా బీమా కంపెనీలు కవర్ చేస్తున్నాయి.
8. రోడ్ అంబులెన్స్ చార్జీలు
స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంబులెన్స్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీలలో బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రీమియం ఆసుపత్రులు పెద్ద మొత్తంగా అంబులెన్స్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. కావున ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
9. బీమా మొత్తం రీఫిల్
మీ బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్) వరకు మీరు ఏడాదికి రెండు సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతీసారి తలెత్తే వ్యాధులు, వాటికి చికిత్సలు వేరుగా ఉంటాయి కనుక.
10. నో క్లెయిమ్ బోనస్
ప్రతీ క్లెయిమ్ చేయని సంవత్సానికి బీమా చేయబడిన వ్యక్తులు డిస్కౌంట్లను పొందుతారు. మీ బీమా విలువ పెరుగుతుంది (ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే). తదుపరి సంవత్సరాల్లో అది వారి ప్రీమియం చార్జీలను తగ్గిస్తుంది లేదా అదనపు బీమా మొత్తం విలువను అందజేస్తుంది.
11. డెయిలీ హాస్పిటల్ క్యాష్ కవర్
డైలీ క్యాష్ అలవెన్స్ అనేది కొన్ని సంస్థల ద్వారా అందించబడుతుంది. ఆసుపత్రిలో చేరిన సమయంలో చెల్లింపు నష్టాన్ని పూరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
12. కో–పేమెంట్
సున్నా కో–పేమెంట్ అనేది రోగిని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయకుండా ఉంచుతుంది. చాలా కంపెనీలు బీమా చేయబడిన వ్యక్తి యొక్క బీమా మొత్తం విలువ వరకు ఉన్నంతలో మెడికల్ బిల్లులను కవర్ చేస్తాయి. సున్నా కో–పేమెంట్ రోగి పూర్తి రికవరీ మీద దృష్టి పెట్టేలా చేస్తుంది.
13. జోన్ అప్‌గ్రేడ్ ఫెసిలిటీ
మన దేశంలో చికిత్స ఖర్చులు అనేవి ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. ఢిల్లీ, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ ఖర్చులు మరింత ఎక్కువగా ఉంటాయి.
జోన్ అప్‌గ్రేడ్ ఫెసిలిటీతో zone upgrade మీకు వివిధ నగరాల్లో చికిత్స కోసం అధిక ఆర్థిక కవరేజీని పొందవచ్చు. వివిధ నగరాల్లో ఉండే వైద్య ఖర్చుల ప్రకారం జోన్స్ వర్గీకరించబడ్డాయి. ఎక్కడైతే వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయో అటువంటి హైయ్యర్ జోన్స్‌గా విభజించబడ్డాయి.
ఈ యాడ్ ఆన్ వివిధ జోన్లలోని చికిత్సా ఖర్చుల వ్యత్యాసాన్ని కొంచెం అధిక ప్రీమియంతో లెక్కించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొత్తం ప్రీమియంలో 10–20 శాతం ఆదా అయ్యేలా చేస్తుంది.
14. డొమిసిలియరీ కేర్
హోమ్ హాస్పిటలైజేషన్‌లో అయిన అన్ని ఖర్చులను కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ కవర్ చేస్తుంది. ఇందులో మెడికేషన్, నర్సు ఫీజులు, ఇంజెక్షన్లు మొదలయినవి ఉంటాయి. రోగికి సమగ్ర చికిత్స కోసం చెల్లింపులు చేస్తుంది.
15. అవయవ దాన చార్జీలు
అవయవ దానం కోసం అయ్యే అన్ని వైద్యఖర్చులకు క్లెయిమ్స్ చేయొచ్చు.
చాలా బీమా కంపెనీలు పైన పేర్కొన్న నిబంధనలను పాటిస్తాయి. వివిధ రకాల బీమా కంపెనీలు నిర్దిష్ట వయో గ్రూప్ వారికి ప్రత్యేక వ్యాధులకు మాత్రమే అందజేస్తాయి.