
1. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్
ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరులో ఉన్న విధంగానే కేవలం ఒకే వ్యక్తికి వర్తిస్తుంది. ఈ కవర్‌ను మీతో పాటు మీ తల్లిదండ్రులు, పిల్లలు, భార్య మొదలయిన వారికి తీసుకోవచ్చు.
ఈ ప్లాన్ కింద ప్రతీవ్యక్తి వేర్వేరు బీమా మొత్తాన్ని పొందుతారు. ఉదాహరణకు మీ బీమా మొత్తం విలువ రూ. 10 లక్షలు అయితే మీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ పాలసీ గడువులోగా రూ. 10 లక్షలు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు కనుక ముగ్గురు వ్యక్తుల కోసం రూ. 10 లక్షల బీమా మొత్తంతో ఇండివిజువల్ పాలసీని కొనుగోలు చేస్తే అప్పుడు మొత్తం బీమా మొత్తం విలువ రూ. 30 లక్షలు అవుతుంది.
ఈ పాలసీలో ఉండే సెపరేట్ బీమా మొత్తం వలన మీ కుటుంబ సభ్యులకు ఒకేసారి ఏదైనా జరిగితే ఇది కవర్ చేస్తుంది.
2. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్
ఇటువంటి పాలసీల్లో ఒక బీమా మొత్తం విలువ కుటుంబంలోని అందరికీ వర్తిస్తుంది. ఈ బీమా మొత్తం విలువ మొత్తం ఒకరికే అయిపోతే అటువంటి సందర్భంలో ఈ పాలసీ మీద ఇంకా ఎటువంటి క్లెయిమ్స్ కవర్ కావు. కావున ఖర్చులు కవర్ చేయబడవు.
వయోవృద్ధులు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌కు అర్హులు కారు. ఎందుకంటే వారి వైద్యపరమైన అవసరాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి.
ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
3. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్
ఈ ప్లాన్ వృద్ధుల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్లాన్‌ను 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే పొందేందుకు అర్హులు. వృద్ధాప్యం వలన వచ్చే చాలా రకాల వ్యాధులకు చికిత్స ఖర్చులను ఈ పాలసీ అందజేస్తుంది.
4. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్
కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇటువంటి పాలసీలను తీసుకుంటాయి. ప్రీమియంను కంపెనీ యజమాని చెల్లిస్తాడు. బీమా మొత్తం విలువ రీఫిల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖర్చుతో కూడుకున్నవి.
మీరు సదరు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే ఈ పాలసీ ప్రయోజనాలను పొందుతారు. ఒకవేళ మీరు ఉద్యోగం మానేసినా లేదా కంపెనీయే మిమ్మల్ని తీసేసినా కానీ మీరు ఈ ప్రయోజనాలను పొందలేరు.
5. మెటర్నటీ ఇన్సూరెన్స్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్
గర్భదారణ సమయంలో ప్రీ, పోస్ట్ నేటల్ ఖర్చులు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కవర్ అవుతాయి. పుట్టిన నవజాత శిశువు మొదటి మూడు నెలల మెడికల్ బిల్లులు కూడా కవర్ అవుతాయి. కానీ ఇటువంటి పాలసీలకు రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
మెటర్నటీ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
6. టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్
మీరు తరుచుగా హెల్త్ పాలసీ తీసుకుంటున్నప్పటికీ, మీ చికిత్సల ఖర్చులు అనేవి దినదినం పెరుగుతూ పోతాయి. మీ బీమా మొత్తం విలువ మారకపోయినా చికిత్స ఖర్చులు పెరిగిపోతాయి.
అటువంటి సందర్భాల్లో మరలా మీరు ప్రత్యేకించి పాలసీని కొనుగోలు చేయడానికి బదులుగా టాప్–అప్ను వాడుకోవచ్చు.
ఈ టాప్–అప్ పాలసీ మీ బీమా మొత్తం విలువను పెంచుతుంది. కానీ టాప్–అప్ ప్లాన్ పొందాలంటే మీరు ముందు డిడక్టబుల్ అమౌంట్ ఎంచుకోవాలి. ఉదాహరణకు రూ. 3 లక్షల టాప్–అప్ మీరు ఎంచుకుంటే రూ. 50,000 డిడక్టబుల్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసుకున్న సమయంలో ముందుగా డిడక్టబుల్ అమౌంట్ రూ. 50,000 మీ జేబు నుంచి భరించాల్సి ఉంటుంది. డిడక్టబుల్ అమౌంట్ పూర్తయిన తర్వాత బీమా కంపెనీ మిగతా ఖర్చులను రూ. 3 లక్షల వరకు భరిస్తుంది.
ఒక వ్యక్తి తన జీవితంలో చేసే అన్ని రకాల హెల్త్ ఖర్చులను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తాయి. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా ఉండవు. బీమా చేసిన వ్యక్తి జీవితం లేదా మరణం ఆధారంగానే ఆర్థిక కవరేజీని అందిస్తాయి.
