gunturnews.in

సరస్‌ మేళా విజయం … ప్రజలది
– కలెక్టర్‌ తమిమ్‌ అన్సారియా

సరస్‌ మేళా విజయం ప్రజలదేనని జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా అన్నారు. సరస్‌ మేళా విజయవంతం కావడం పట్ల సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరులో సరస్‌ మేళా గొప్ప విజయవంతమైందన్నారు. ఎంత పెద్ద కార్యక్రమమైన విజయవంతం చేయగలమనే విశ్వాసం, నమ్మకం కలిగిందన్నారు. సరస్‌ లో 343 ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసి రూ.25 కోట్లు పైగా విక్రయాలు చేశారని తెలిపారు. ఇది జాతీయ స్థాయి కార్యక్రమం అన్నారు. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్ర శేఖర్‌ కషి ఫలితంగా గుంటూరులో సరస్‌ జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8న ప్రారంభించారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, జాతీయ పేదరిక నిర్మూలన విభాగం అధికారులు మంచి సహకారాన్ని అందించారని చెప్పారు. గుంటూరు ప్రజలు విజయవంతం చేయడంలో గొప్ప భాగస్వామ్యం వహించారని ప్రశంసించారు. మీడియా సహకారం మరువలేనిది అన్నారు. సరస్‌కు మహిళా శక్తి మణులు వచ్చారు, విజయవంతంగా జరిగిందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేశారని పేర్కొన్నారు. సరస్‌ ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. జాతీయ స్థాయిలో మార్కెట్‌ కల్పించడం సరస్‌ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఇతర ప్రాంతాల ఆహార అభిరుచులు ఇతర ప్రాంతాలకు పరిచయం చేయడంలో గొప్ప విజయం సాధించడం జరిగిందన్నారు. మధ్యవర్తులు లేకుండా డ్వాక్రా మహిళలు విక్రయించుటకు ఒక వేదికగా సరస్‌ నిలిచిందన్నారు. సరస్‌ లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుటకు దోహదం చేస్తుందని చెప్పారు. దాదాపు 14 లక్షల మంది సందర్శించారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు నాణ్యమైన ఉత్పత్తులు తీసుకువచ్చారని, అది విజయవంతం కావడానికి దోహదం చేసిందన్నారు. ఇది గొప్ప ప్రేరణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎస్‌.కె.ఖాజావలి, డి.ఆర్‌.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.విజయ లక్ష్మీ, సహాయ ప్రాజెక్టు డైరెక్టర్‌ కిరణ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version