
స్థానిక ఆర్అగ్రహారంలోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఈమేరకు విశేష కుంకుమపూజ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకుచెందిన మహిళ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి చైర్మన్ కోటా శేషగిరి, ఆర్యవైశ్య మహాసభ ఈసీ సభ్యులు కొనకళ్ల సత్యం, కాకుమాను శ్రీనివాసరావు, కారం శెట్టి లోకేష్, జూలూరి హేము, పి.కన్న పాల్గొన్నారు.
