గుంటూరు నగరానికి కీలకమైన శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనుల్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పనులను యుద్ద ప్రాతిపదినక పూర్తి చేయనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి వీలుగా సైట్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన భాధ్యత నగరపాలక సంస్థపై ఉన్నందున, ఆ దిశగా అధికారులు తగిన కషి చేయాలన్నారు. కమిషనర్ మయూర్ అశోక్ తొలుత ఆర్ఓబి నిర్మాణ పరిధి, ఎన్ని భవనాలు ప్రభావితం అవుతున్నదీ, ఇప్పటి వరకు తొలగించినవి, కోర్ట్ కేసులు తదితర అంశాలను సమగ్రంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రాడీపేట వైపు పెండింగ్ లో ఉన్న పిల్లర్లలో ఒక పిల్లర్ నిర్మాణంకు సైట్ క్లియర్‌గా ఉన్నందున పనులు చేపట్టవచ్చన్నారు. అంగీకారం తెలిపిన భవనాలను తక్షణం తొలగించాలని, తెలపని వారితో మరోమారు వారి సమస్యలు, అనుమానాలను తెలుసుకొని, జీఎంసీ నుంచి తీసుకోవాల్సిన పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కష్ణయ్య , ఈఈ వేణుగోపాల్, డీసీపీ సూరజ్ కుమార్, ఏసీపీ రెహ్మాన్, కార్పొరేటర్ వరప్రసాద్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఆర్వోబీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న మేయర్ రవీంద్ర, కమిషనర్ మయూర్ అశోక్
