
గుంటూరు 23-01-2026 శుక్రవారం : శ్రీపంచమి సందర్భంగా బ్రాడీపేట శ్రీగౌరీశంకర నిలయంలో శ్రీభారతి సంగీతా నిలయంలో శుక్ర వారం సాయంత్రం సరస్వతి అమ్మవారిపై శ్రీసరస్వతి, సరసీరుహ అనేక కీర్తనలను వీణపై పలికించి నాదార్చన నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు వీణ విశారద భారతీదేవి ఆధ్వర్యంలో శిష్య బందం చేపట్టారు. తొలుత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తెల్లని పువ్వులతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శిష్య బందానికి తీర్ధ ప్రసాదాలు అందించారు.