
గుంటూరు 24-01-2026 శనివారం :
కేర్ దంత వైద్య కళాశాలను ఎన్.టీ.ఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ వైద్యులు నిరంతర పరిశోధనల ద్వారా, నూతన ఆవిష్కరణల ద్వారా మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించగలరన్నారు. వెద్య విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కేర్ దంత వైద్య కళాశాల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రసూల్ సయ్యిద్ మాట్లాడుతు విశ్వవిద్యాలయ పరీక్షలను కట్టుదిట్టంగ నిర్వహించడలో చంద్రశేఖర్ చొరవ ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో కేర్ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఓరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మెహబూబ్, ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేష్, మెడిసిన్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ స్మిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.