
గుంటూరు ది. 02-02-2026 సోమవారం :
నగరంలోని శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, శ్రీజగన్నాధస్వామి వారి దేవస్థానం (కొత్తపేట), శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (లాలాపేట)లో శ్రీ స్వామి వార్ల హుండీలను సోమవారం లెక్కించారు. మూడు దేవస్థానాల ఈవో టి.సుభధ్ర, శారదానికేతన్ ఈవో టి.శ్రీనివాస్ పర్యవేక్షణలో శ్రీభూమా వీర వెంకటభాపారావు (ఆర్‌ఎస్‌ఎల్) నారాయణ రోరవల్ కూర్ సభ్యుల సహకారంతో లెక్కింపు చేపట్టారు. శ్రీజగన్నాధస్వామి వారి దేవస్థానం హుండీ రూ.16,106, శ్రీఆంజనేయస్వామి వారి దేవస్థానం హుండీ రూ. 3.76 లక్షలు, శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం రూ.5.77 లక్షలు వచ్చాయని ఈవో సుభద్ర తెలిపారు.
మూడు దేవస్థానాలకు మూడు నెలల పదిహేను రోజులకు రూ.9.70 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. పది దుబాయ్ డాలర్లు, 33 అమెరికా డాలర్లు, 28 గ్రాముల బంగారం, 918 గ్రాముల వెండి వస్తువులు కానుకల రూపంలో హుండీల ద్వారా వచ్చాయని పేర్కొన్నారు. లెక్కింపులో నారాయణ రోరవల్ కూర్ సభ్యులు, దేవస్థానాల సిబ్బంది పాల్గొన్నారు.
