
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారి షేక్.ఖాజావలి, వివిధ మతాధికారులు
గుంటూరు 24-01-2026 శనివారం :
జాతీయ బాలికా దినోత్సవంను, బాల్య వివాహ ముక్తిభారత్ రెండవ విడత ప్రచార కార్యక్రమంను కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం వివిధ మతాలకు సంబంధించిన మతాధికారులకు బాల్య వివాహ నిరోధమునకు సంబంధించి అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిధిగా విఛ్చేసిన డిఆర్ఓ ఖాజావలి ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సంధర్భంగాఆయన మాట్లాడుతూ బాలికల విద్య పట్ల అందరూ శ్రద్ధ పెట్టాలని, మన జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, బాల్య వివాహాలు జరిగినచో సంబంధిత వ్యక్తులందరిపై చర్య తీసుకుంటారని తెలిపారు. జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి పి పి జి ప్రసూన మాట్లాడుతూ 181, 1098 టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, మహిళాభివద్ధి మరియు సంక్షేమ శాఖ, బాలలు, స్త్రీల రక్షణకు కట్టుబడిందని, ఆడపిల్లలకు 18 సంవత్సరములు మగ పిల్లవానికి 21 సంవత్సరములు నిండకుండా వివాహము చేయరాదని, వారి విద్యకు నైపుణ్యాభివద్ధికి కషిచేసి వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. అలాగే మన జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దటములో, మాతాధికారులు ప్రముఖ పాత్ర వహిస్తారని, మరియు ప్రతి మతాధికారి కృషి చేసినట్లయితే మన జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా అభివద్ధి చేసుకొనవచ్చునని తెలిపారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ జి ఏ ప్రమీల మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తే బాల్యవివాహాలు తగ్గుతాయని మరియు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలిక అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యతోనే అభివద్ధి సాధ్యమని. ప్రతి బాలిక కూడా స్వయం సాధికారత లక్ష్యంగా కృషి చేయాలని తెలిపారు.
దేవాదయ శాఖ ఎగ్జిక్యూటీవ్ అధికారి కే వీరాంజనేయులు మాట్లాడుతూ తమ శాఖ మహిళాభివద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తో కలిసి పనిచేస్తుందని కలిసి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని తెలిపారు.
జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జె. పార్థసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాలికల అభివద్ధి దిశగా కృషి చేయాలని దీనివలన సమాజం అభివద్ధి చెందుతుందని తెలియజేశారు.
నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ వెంకట కష్ణయ్య మాట్లాడుతూ సమాజాన్ని బాల్యవివాహా రహిత సమాజముగా తీర్చిదిద్దాలన్నారు.
పౌరహితులు రొంపిచర్ల శేషు కుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలనకు తమ అందరము కృషి చేస్తామని మరియు బాల్యవివాహాల దుష్ప్రభావాల గురించి తెలిపారు.
హఫీస్ మహమ్మద్ రిజ్వాన్, మాట్లాడుతూ ప్రతి వివాహమును రిజిస్టర్ చేసి, ఆన్లైన్ చేయవలెనని దీనివలన బాల్య వివాహాలు తగ్గుముఖం పడతాయని సూచించారు.
అనంతరం బీ.రవిప్రకాష్, తంబి ప్రాజెక్ట్ డైరెక్టర్ క్రాఫ్ట్ ఫ్రాన్సిస్, కె.వి.నారాయణ, తదితరులు మాట్లాడారు.
అనంతరం బాల్యవివాహాల వ్యతిరేకంగా సభికులందరూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి ,మిషన్ వాత్సల్య సిబ్బంది, విద్యా సంస్థల నుండి బాలికలు, జిల్లా అధికారులు, ఫినిష్ సొసైటీ – ఐ టి సి బంగారు భవిష్యత్తు సిబ్బంది, క్రాఫ్ట్ ఎన్జీవో సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.
