gunturnews.in

ఫిబ్రవరి 25న ఉచిత సామూహిక ఉపనయనములు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సమితి అధ్యక్షుడు, సభ్యులు

బ్రాడీపేట బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న ఉచిత సామూహిక ఉపనయనములు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌ బొప్పూడి శివరామకష్ణ ప్రసాద్‌ తెలియజేశారు. ఈ అవకాశాన్ని బ్రాహ్మణులకు మాత్రమే అని చెప్పారు. బ్రాహ్మణ సేవా సమితిలో ఉపనయనముల కరపత్రముల ఆవిష్కరణ బుధవారం జరిగింది. ఉపనయనములు చేసుకోదలుచుకున్న వారు ఫిబ్రవరి 15వ తేదీ లోపు బ్రాహ్మణ సేవ సమితి ఆఫీసులో అప్లికేషన్‌ అందజేయాలన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు నందిరాజు పాండురంగారావు, ఉపాధ్యక్షులు వేదాంతం వెంకట వినోద్‌ కిరణ్, కార్యదర్శి రంగా వజ్జుల లక్ష్మీపతి, కోశాధికారి తుళ్లూరు ప్రకాష్, కో కన్వీనర్‌ ముక్కామల మారుతి రాంగోపాల్, సభ్యులు గొల్లపూడి రామకష్ణారావు, కర్లపాలెం బాలకష్ణ, కటక రాజు సాయిబాబా శర్మ, ఇంజనంపాటి సుబ్రహ్మణ్యం, దుర్భ ఫణిభూషణ్, తూటు పల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Exit mobile version