
సరస్వతీ కమిటీ స్కూల్లో చిన్నారులతో సుబ్బారావు, ఉపాధ్యాయులు
–సీతారామ్‌నగర్‌లోని శ్రీసరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాఠశాలలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. పాఠశాల ప్రాంగణంలో కొలువైన శ్రీలక్ష్మి గణపతి, శ్రీసరస్వతీదేవి అమ్మవార్ల విగ్రహాలకు అర్చకస్వాములు పంచమి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డీవీ సుబ్బారావు చిన్నారులకు పలకలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు వరలక్ష్మి, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం మానసవీణ, ఉపాధ్యాయులు అరుణకుమారి, జయరాం, నాగమేరి, సంగీత, శ్రీవిద్య పాల్గొన్నారు.
జీకేఆర్ హైస్కూల్లో సరస్వతీపూజలో ప్రిన్సిపాల్ సుశీల, విద్యార్థినులు
జీకేఆర్ హైస్కూల్ పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్‌లలో శుక్రవారం సరస్వతీపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో భక్తి,శ్రద్దలతో పూజలో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చదువుల తల్లి అనుగ్రహంతో విద్యార్థులు విద్యావంతులుగా, విజ్ఞానవంతులుగా ఎదగాలని అన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ శైలజ, సుశీల పాల్గొన్నారు.
సకల విద్యలకు ఆది దేవత అయిన సరస్వతీదేవి అనుగ్రహంతో అన్ని రంగాల్లో రాణించగలరని బాసర కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ దాసరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో వసంత పంచమి సందర్భంగా శ్రీసరస్వతీదేవి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న కళాశాల పూర్వ విద్యార్థి దాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవతల కోరికపై సరస్వతీదేవి చతుర్భుజాలతో, పుస్తకధారియై, స్ఫటిక మాలాధారియై, వీణాధారియై ఆవిర్భవించిన రోజు మాఘశుద్ధ పంచమి అని, దానినే శ్రీ పంచమి గా జరుపుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా సరస్వతీద్వాదశస్తోత్రాన్ని అధ్యాపకులు ఆర్.జయశైలజ, డాక్టర్ పి.దేవేంద్రగుప్త విద్యార్థులతో చెప్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఏ. భానుమురళీధర్, ఇంటర్మీడియట్ ఇన్‌చార్జ్ జి. సురేష్ కుమార్, అధ్యాపకులు పి.చంద్రికా, డాక్టర్ అంజనీకుమార్, డాక్టర్ జె.సుధీర్‌కుమార్, పి.కుమార్ రాజా, జి.సురేష్ కుమార్, బి.శ్రీనివాసరావు, టి.నాగనిర్మలారాణి, ఆర్.స్వామి, కె.కవిత, పీఎల్‌ఎన్ చంద్రిక, పి.నాగమణి, వైవైసీహెచ్ మణి, విద్యార్థులు పాల్గొన్నారు.