gunturnews.in

పవర్‌ లిఫ్టింగ్‌ జాతీయ స్థాయి గోల్డ్‌ మెడల్‌ సాధించిన ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్ధిని

లిఫ్టింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన గుర్రం స్వాతి

గుంటూరు 24-01-2026 శనివారం :
ఈనెల 18వ తేది నుంచి 21వ తేది వరకు శుభ్రత క్లాసిక్‌ నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ – నేషనల్‌ డెడ్‌ లిప్ట్‌ చాంపియన్‌ ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ వారు హరిద్వార్‌ లో నిర్వహించిన నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ లో గుంటూరు నగరం మల్లారెడ్డి నగర్‌ ప్రాంతానికి చెందిన గుర్రం స్వాతి బంగారు పతకాంను కైవసం చేసుకున్నారని, కోచ్‌ మెంటర్‌ నీలా యోబు శనివారం తెలిపారు.

గుర్రం స్వాతి గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల ఇంటర్‌మీడియట్‌ ద్వితీయ సంవత్సం విధ్యాభాస్యం చేస్తుంది. అండర్‌ జూనియర్‌ 84 కేజీ విభాగం లో నేషనల్‌ రికార్డు బంగారు పతాకాన్ని పొందటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు నగరము పేరు జాతీయ స్థాయి లో ఖ్యాతి పొందటం ఆనందంగా ఉందని స్వాతి కుటుంబ సభ్యులు మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version