
–యువత, విద్యార్ధులే లక్ష్యంగా విక్రయాలు
– యాభై గ్రాముల ప్యాకెట్ రూ.800లు
– సుమారు 4.2 కిలోలు స్వాధీనం..
యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి కార్యకలాపాలు నిర్వహించే ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో ది. 21-01-2026న జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసుల వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో టోల్‌ప్లాజా మధురానగర్‌లోని ఓ వెంచర్‌లో మంగళవారం మంగళగిరి రూరల్ పీఎస్ సీఐ బ్రహ్మం, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తనఖీలు చేశారని అన్నారు. ఈ క్రమంలో పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దాసరి వినయ్‌బాబు (మంగళగిరి యర్రబాలెం), కొల్లిమర్ల లోకేష్ (నవులూరు), రామిదేని సాయికష్ణ (అంబటినగర్), తట్టుకోళ్ల దానియల్‌రాజు అలియాస్ బడాయి (పుల్లయ్యనగర్, కాజా), బండిరెడ్డి నంద్ (తాడేపల్లి), చిరుుబోయిన హరికష్ణ (కాజా), నల్లగొర్ల సాయితేజ (దుగ్గిరాల), మైనర్ (తాడేపల్లి) స్నేహితులని అన్నారు. వీరంతా గంజాయి, చెడు అలవాట్లకు బానిసయ్యారని చెప్పారు. రామిదేని సాయికష్ణ విజయవాడ జైల్లో ఒకరూ పరిచయమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒడిసా రాయగఢ్‌లో రైల్వేతరక్క వద్ద డొరా అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తాడని ఫోన్ నంబర్ యిచ్చాడని పేర్కొన్నారు. అనంతరం సాయికష్ణ, మిగతా ఆరుగురు, మైనర్ కల్సి ఒడిశా రాయగఢ్‌లోని డోరా కిలో రూ.8 వేలకు గంజాయి కొనుగోలు చేశారని చెప్పారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత తాగగా, మిగతాది యాభై గ్రాముల ప్యాకెట్లుగా చేశారని అన్నారు. ఒక్కో ప్యాకెట్ రూ.800లకు గ్రామాల్లో విక్రయించేవారని తెలిపారు. ఇక చినకాకాని హైల్యాండ్ సమీపాన గంజాయి తాగే సాధం పవన్‌మాధవ్ (దుగ్గిరాల), సొంటి విష్ణువర్ధన్ (పెద్దపాలెం), కుందేటి చెన్నకేశవ (పెరికలపూడి), సాయన అనంతకుమార్ (కానూర్, విజయవాడ), మందా అమాన్ (లింగంపల్లి, తెలంగాణ), మలబండి చంద్రశేఖర్ (కాజా), మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారని అన్నారు. ఈ మేరకు పదిహేను మందిని అరెస్ట్ చేయగా, 4.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పరారీలో ఉన్న డొరాను పట్టుకుంటామని తెలిపారు.
పట్టుబడిన వారిపై గతంలో కేసులు నమోదు..
ఇందులో వినయ్‌బాబు ప్రధానంగా వ్యవహరించాడని తెలిపారు. అతనిపై గుత్తికొండ పీఎస్, గుంటూరు జిఆర్‌పి పీఎస్‌లో రెండు గంజాయి కేసులు, కొల్లిమర్ల లోకేష్‌పై రోడ్ ప్రమాదం కేసు, రామిదేని సాయికష్ణపై మంగళగిరి రూరల్ పీఎస్, గుంటూరు జిఆర్‌పి పీఎస్, విజయవాడ రెండో పట్టణ పీఎస్‌లో మూడు గంజాయి కేసులు, తట్టుకోళ్ల దానియల్‌రాజుపై మంగళగిరి రూరల్ పీఎస్‌లో ఒక గంజాయి కేసు, బండిరెడ్డి నందుపై తాడేపల్లి పీఎస్‌లో మూడు గంజాయి కేసులు, మంగళగిరి ఎ క్సైజ్ పీఎస్, విజయవాడ ఒకటో పట్టణ పీఎస్, భద్రాచలం పీఎస్‌లో గంజాయి
కేసులు, చిరుబోయిన హరికష్ణపై మంగళగిరి రూరల్ పీఎస్‌లో ఒక గంజాయి కేసు, సాయితేజపై దుగ్గిరాల పీఎస్‌లో ఒక గంజాయి కేసు, ఒక హత్యాయత్నం కేసు, ఒక మైనర్‌పై మంగళగిరి రూరల్ పీఎస్‌లో ఒక గంజాయి కేసు ఉన్నాయని అన్నారు. మంగళగిరి రూరల్ పీఎస్ ఏవీ.బ్రహ్మం, ఎస్‌ఐ సిహెచ్.వెంకటేశ్వర్లు, హెచ్‌సీలు రత్న రాజు, డి.శ్యాంకుమార్, బి.రామలింగేశ్వరరావు, చలమరావు, పి.మణికుమార్, పీసీలు సాగర్‌బాబు, కెవి.శ్రీనివాసరావు, ఎం.రాములను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు అందించారు.