gunturnews.in

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌

-7 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-వివరాలు వెల్లడించిన వెస్ట్‌ డిఎస్పీ అరవింద్‌
–విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డిఎస్పీ కె.అరవింద్, అరండల్‌పేట సిఐ

ద్విచక్రవాహనాలు చోరి చేసే వ్యక్తి అరెస్ట్‌ చేసి అతని వద్ద చోరి చేసిన 7 ద్విచక్రవాహనాలను బుధవారం అరండల్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ డిఎస్పీ కె.అరవింద్‌ వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 11వ తేదిన రాత్రి 7 గంటల సమయంలో అరండల్‌పేట 11/1వ లైన్‌లో రోడ్డు పక్కన చైతన్యపురి కాలనీకి చెందిన అవుతూ రవీంద్రరెడ్డి ద్విచక్రవాహానాన్ని పార్కింగ్‌ చేసి వెళ్ళి తిరిగి వచ్చి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల నగరంలోని పలు పార్కింగ్‌ సెంటర్‌ల వద్ద పరిశీలించగా ఎంతకు వాహనం కనిపించక పోవడంతో ఈనెల ఈనెల 18వ తేదిన అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై లావణ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదిన డొంకరోడ్డులోని వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో శ్రీను అనే వ్యక్తి పోలీసులను చూసి పరారైయేందకు యత్నించగా పోలీసులు గమనించి వ్యక్తిని అదుపులో తీసుకుని అతని వద్ద ఉన్నవాహనాన్ని పరిశీలించగా చోరి చేసినట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో శ్రీను 7 ద్విచక్రవాహనాలను చోరి చేసినట్లు అంగీకరించగా చోరి చేసిన వాహనాలను అరండల్‌పేట పోలీసులు రికవరి చేసి స్టేషన్‌కు తరలించి స్వాధీనం చేసుకున్నారు. శ్రీను పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి కోర్టు హజరు పరచగా రిమాండ్‌ విధించారు. ఈ చోరి కేసులో ప్రతిభను కనబరచిన అరండల్‌పేట సిబ్బందిని, డిఎస్పీ వెస్ట్‌ అరవింద్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు.

Exit mobile version