gunturnews.in

తులసి యోగీష్ జన్మదిన వేడుకలు 

గుంటూరు – 23-01-2026 శుక్రవారం : తులసి సీడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తులసి యోగీష్ చంద్ర జన్మదిన వేడుకలు శనివారం అరండల్ పేటలోని యోగి భవన్ లో ఆఫీస్ సిబ్బంది, అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు ప్రముఖులు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, తోట రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, దాసరి వాసు, మిరియాల శ్రీనివాస్, బొక్కిసం శివరాం, దళావాయి సుబ్రహ్మణ్యం, పుచకాయల ఆనంద్, సుప్రీమ్ సర్జికల్స్ జవహర్ తదితరులు హాజరై అభినందనలు తెలియజేశారు. అభినందనలు అందజేసిన వారందరికీ శ్రీ యోగీష్ కృతఙ్ఞతలు తెలియజేస్తూ ఎంతో కాలంగా తమ సంస్థలలో పనిచేస్తూ సంస్థలను ముందుకు నడిపిస్తున్న తులసీ ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని ఇందరి సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. దినదినాభివృద్ధి చెందుతున్న తులసి సంస్థలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తమ తోడ్పాటును అందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి ఇంకా లక్ష్మీశెట్టి నాని, డేగల లక్ష్మీనారాయణ, పోలీస్ అధికారుల సంఘం మనికే లక్ష్మయ్య, పసుపులేటి రమణయ్య, యర్రంశెట్టి సూరి, తిరుమలశెట్టి రమేష్, ఇర్రి కిరణ్, , బెవరా శ్రీరాములు , కనకం నరసింహారావు, తరుణ్, భజరంగ్ రామకృష్ణ, దుర్గా ప్రసాద్, వై.వి.సుబ్బారావు, పోలినేని సాంబశివరావు, తులసి గ్రూప్ సిబ్బంది, వివిధ బ్యాంక్ ఉద్యోగులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదితరులు విచ్చేసి శ్రీ యోగీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version