
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కు చెక్కు అందజేస్తున్న భాష్యం రామకష్ణ
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీటీడీ నిత్యాన్నదానానికి భాష్యం విద్యా సంస్థల ఛైర్మన్ భాష్యం రామకష్ణ రూ.44 లక్షలు విరాళాన్ని అందజేశారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ను కలిసిన భాష్యం రామకష్ణ విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక రోజు అన్నదాన నిమిత్తం రూ.44 లక్షల విరాళాన్ని వితరణ చేశామని తెలిపారు.