
ఎన్‌సీసీ కేడెట్ వేల్పుల రవి
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు టీజేపీఎస్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్‌సీసీ కేడెట్ వేల్పుల రవి పాల్గొనబోతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి తెలిపారు. పట్టాభిపురంలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కామేశ్వరశాస్త్రి మట్లాడుతూ కళాశాలలో అందిస్తున్న క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనతో విద్యార్థులు ప్రతి యేటా దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు వెళుతున్నారని అన్నారు. విద్యార్థుల్లో స్పత్ప్రవర్తన, నైతిక విలువలను పెంపొందించడంలో ఎన్‌సీసీ శిక్షణ దోహదం చేస్తుందని చెప్పారు. అదే విధంగా తమ కళాశాల ఎన్‌సీసీ అధికారి మేజర్ పి.కుమార్‌రాజా లక్షద్వీప్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంటిగ్రేషన్ శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎన్‌సీపీ కేడెట్ వేల్పుర రవితో పాటు మేజర్ కుమార్ రాజాను కళాశాల పాలకమండలి అధ్యక్షుడు పోలిశెట్టి శ్యామ్ సుందర్, కార్యదర్శి కేవీ బ్రహ్మం, అధ్యాపకులు అభినందించారు.