gunturnews.in

జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ ఎగ్జిబిషన్,

ఈనెల 30,31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టి.టి.డి కళ్యాణ మండపంలో జరిగే ఎ.ఐ.కె.యస్‌ జాతీయ కౌల్సిల్‌ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుండి జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్, వివిధ అంశాలపై సెమినార్స్, సాంస్కతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షలు, మాజీ ఎమ్‌.ఎల్‌.సి కె.యస్‌ లక్ష్మణరావు కోరారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముందుగా కార్యక్రమాలS కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో నగరంలోని టి.టి.డి కళ్యాణ మండపంలో ఎ.ఐ.కె.యస్‌. జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్, సెమినార్లు,సాంస్కతిక కార్యక్రమాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎగ్జిబిష¯ŒSలో వ్యవసాయ రంగానిక సంబంధించి సుమారు 100 వరకు స్టాల్స్‌ వుంటాయన్నారు. మెడికల్, ఇంజనీరింగ్‌ విద్యార్ధుల నూతన పరిశోధనలు, నూతన వ్యవసాయ పరికరాలు, విధానాలు, వ్యవసాయ సమస్యల పరిష్కారాలు, పత్యామ్నాయలతో కూడినవి స్టాల్స్‌లో వుంటాయన్నారు. వీటితో పాటు ప్రజాశక్తి వారు 50వేల రకాల పుస్తకాలు ప్రదర్శించబడతాయన్నారు. అదేవిధంగా జనవిజ్ఞాన వేదిక వారిచే సై¯Œ్స పరిశోధన పరికాల ప్రదర్శన, మ్యాజిక్‌ ప్రదర్శనలు ఉంటాయన్నారు. వీటితో పాటు ప్రతిరోజు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అంశంపై సెమినార్‌ నిర్వహిస్తున్నామని, అనంతరం కళాకారులచే అనేక సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజానీకం ఈకార్యక్రమాలను వీక్షించి జయప్రదం చేయాలన్నారు.

Exit mobile version