Close Menu
gunturnews.in
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

ఆలసటగా ఎక్కువగా ఉంటుందా… రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే?

By subhanih@gmail.comDecember 6, 2025

…

హెల్త్ ఇన్సూరెన్స్​లోని రకాలు

By subhanih@gmail.comDecember 6, 2025

…

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నపుడు తీసుకొవలసిన జాగ్రత్తలు

December 6, 2025

హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ?

December 6, 2025
Facebook X (Twitter) Instagram
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
gunturnews.in
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.in
You are at:Home » చలి నొప్పులు
Uncategorized

చలి నొప్పులు

subhanih@gmail.comBy subhanih@gmail.comDecember 5, 2025Updated:December 5, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చలికాలం కొందరికి హాయిగానే ఉంటుంది. కొందరికి మాత్రం నొప్పులతో వేధిస్తుంది. అవును. చలికాలంలో కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రమవుతుంటాయి. భుజాలు బిగుసుకుపోవటం, మోకాళ్లలో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై.. క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తుంటాయి. దీంతో మెట్లు ఎక్కటం, ముందుకు వంగటం, కాఫీ చేత్తో పట్టుకోవటం వంటి మామూలు పనులూ పెద్దవిగా తోస్తుంటాయి. ఇంతకీ చలికాలంలో నొప్పులు ఎందుకు తీవ్రమవుతాయి?

కారణాలు ఇవీ..

కండరాలు బిగుసుకోవటం: వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు,
స్నాయువులు బిగుతుగా అవుతాయి. దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు
పెరుగుతాయి. ముఖ్యంగా మెడ, నడుం, మోకాళ్లు, భుజాల నొప్పులు ఎక్కువవుతాయి.

రక్త ప్రసరణ తగ్గటం: చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు,
ఎముకలకు రక్తం అందటం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టటానికి బీజం
పడినట్టే. కీళ్లు, కండరాలు కోలుకోవటమూ మందగిస్తుంది.

విటమిన్‌ డి పడిపోవటం: శీతకాలంలో ఎండ కాయటం తగ్గుతుంది. ఒంటికి తగినంత ఎండ తగలకపోతే
విటమిన్‌ డి మోతాదులూ పడిపోతాయి. ఇది కీళ్లు, నడుం నొప్పులతో పాటు నిస్సత్తువ ఎక్కువ కావటానికీ దారితీస్తుంది.
పాత గాయాలు ఉద్ధృతం: పాత గాయాలతో చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు చలి మూలంగా మరింత నొప్పి కలిగేలా చేస్తాయి.

కీళ్లవాపు తీవ్రం: వయసు మీద పడటం వల్ల కీళ్లు అరుగుతుంటాయి. దీంతో కీళ్లు
బిగుసుకోవటం, వాపు, నొప్పి కలుగుతుంది. ఇవి చలికాలంలో మరింత ఎక్కువవుతాయి.
కదలకుండా ఉండటం: బయట చలిగా ఉండటం వల్ల చాలామంది ఇంట్లోనే ఉండిపోవటానికి
ఇష్టపడుతుంటారు. ఇలా కదలికలు తగ్గటం వల్ల కండరాలు బలహీనపడతాయి,
బిగుసుకుంటాయి. ఇవి నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తాయి.

ఎలా తగ్గించుకోవాలి?

దుప్పటి కప్పుకోవటం, నొప్పి ఉన్నచోట వేడి కాపు పెట్టటం, గోరువెచ్చటి
నీటితో స్నానం చేయటం ద్వారా కండరాల బిగువు సడలేలా చూసుకోవచ్చు.

ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు శరీరాన్ని నెమ్మదిగా సాగదీసే వ్యాయామాలు
చేయాలి. ముఖ్యంగా మెడ, వీపు, తొడలు, పిక్కలు సాగదీయటం మీద దృష్టి పెట్టాలి.

ఆరు బయట ఎండ కాస్తున్నప్పుడు నడవటం, ఇంట్లో సైకిల్‌ తొక్కటం మంచిది. తేలికైన యోగాసనాలూ
మేలే. ఇవి రక్త ప్రసరణ పుంజుకోవటానికి, బిగువు తగ్గటానికి తోడ్పడతాయి.

చలికాలంలో తగినంత నీరు తాగకపోవటం వల్ల ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. ఇది
నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తుంది. కాబట్టి రోజుకు 6-8 గ్లాసుల నీరు తాగాలి.

నొప్పిని తగ్గించే పూత మందులు రాసుకోవటం, గోరువెచ్చటి నూనెతో మర్దన చేసుకోవటం ఉపయోగపడతాయి.
అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు పారాసిటమాల్‌ వంటి నొప్పి మందులు వేసుకోవాలి.

చేతులకు గ్లౌజులు, మోకాళ్లకు క్యాప్స్, ఉన్ని సాక్స్‌ ధరించటం ద్వారా కీళ్లు మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

డాక్టర్‌ వద్దకు ఎప్పుడు?

నొప్పి విడవకుండా వేధిస్తున్నా, కీళ్లలో వాపు లేదా ఎరుపు తలెత్తినా, నడవటం లేదా
పడుకోవటానికి నొప్పి ఇబ్బంది కలిగిస్తున్నా, చేతులు లేదా కాళ్లలో పొడుస్తున్నట్టు గానీ మొద్దుబారినట్టుగానీ అనిపిస్తున్నా వెంటనే డాక్టర్‌ను
సంప్రదించాలి.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Next Article చర్మానికి ‘చలి’ వెతలు
subhanih@gmail.com
  • Website

Related Posts

ఆలసటగా ఎక్కువగా ఉంటుందా… రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే?

December 6, 2025

ఇమిటేషన్ జ్యువెలరీకు కేరాఫ్ అడ్రస్ చిలకలపూడి

December 6, 2025

గంటల తరబడి చూస్తున్నారా?

December 5, 2025
Leave A Reply Cancel Reply

Categories
  • Uncategorized
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
© 2025 ThemeSphere. Designed by ThemeSphere.
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

Type above and press Enter to search. Press Esc to cancel.