ఆరోగ్యం కోసం నడక – గుంటూరు కోసం నడక నినాదంతో ఈనెల 25న నిర్వహించనున్న 17వ గుంటూరు 10కే వాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం విద్యానగర్‌లోని ఎన్నారై ఇండియన్‌స్ప్రింగ్స్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో 10కే వాక్ బ్రోచర్ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ ఈనెల 15న ఉదయం 6.00 గంటలకు విద్యానగర్‌లోని ఇండియన్‌స్ప్రింగ్స్ పాఠశాల నుంచి ప్రారంభం కానున్న 10కే వాక్ అమరావతిరోడ్డు మీదుగా ఇన్నర్‌రింగ్ రోడ్డు, జేకేసీ కళాశాల మీదుగా తిరిగి పాఠశాలకు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటులు రాజేంద్రప్రసాద్, కామ్న జెఠ్మలానీ, జబర్ధస్త్ కమెడియన్లు ప్రత్యేక ఆకర్షణగా పాల్గొననున్నారని చెప్పారు. బ్రోచర్‌లో 10కే వాక్ మార్గం, పాల్గొనే వారిని వివిధ విభాగాలు విభజించిన వివరాలతో పాటు బహుమతుల వివరాలు పొందుపర్చినట్లు తెలిపారు. 10కే వాక్‌లో పాల్గొనేందుకు రూ.50 రుసుం చెల్లించిన వారికి టోపీ ఉచితంగా అందజేస్తామని, పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌తో పాటు చెస్ట్ నంబరు ఇస్తామని తెలిపారు. 10కే వాక్ కన్వీనర్, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ 10కే వాక్ రిజిస్ట్రేషన్ కోసం విద్యానగర్, కొత్తపేటలోని ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ క్యాంపస్‌లతోపాటు బీఆర్ స్డేడియం, కొరిటెపాడు, నల్లచెరువు, చుట్టుగుంటలోని వాకింగ్ ట్రాక్స్, కమ్మ హాస్టల్, అన్నమయ్య వాకింగ్ ట్రాక్, ప్రభుత్వ మహిళా కళాశాల, ప్రముఖ జిమ్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎనిమిది విభాగాల్లో ప్రధమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నగదు బహుమతులతో పాటు వెయ్యి మందికి గిఫ్ట్ కూపన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఇతర సమాచారం కోసం 98497 03144, 93969 90666, 94412 68393 నంబర్లో సంప్రదించాలని కోరారు. నడక ద్వారా ఆరోగ్య పరిరక్షణ నినాదంతో చేపడుతున్న కార్యక్రమంలో చిన్నారుల నుంచి వద్దుల వరకు అన్ని వయస్సుల వారు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దాక్షిణ్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీవీ రావు, ఎన్నారై విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్‌బాబు, మలినేని పెరుమాళ్లు ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు, బి.హరిబాబు, ఎన్నారై అగ్రిటెక్ జీఎం సాంబశివరావు, ఫిజికల్ డైరెక్టర్లు ఆర్. శివాజీ, శివశంకర్, జీవీఎస్ ప్రసాద్, రామకష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

బ్రోచర్ విడుదల చేస్తున్న ఆలపాటి రాజా, టీవీ రావు, కోయి సుబ్బారావు, మలినేని పెరుమాళ్లు, తిలక్‌బాబు, తదితరులు