Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Uncategorized»గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావును ఘనంగా సత్కారించిన టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఖలీలుద్దీన్
Uncategorized January 24, 2026Updated:January 24, 2026No Comments6 Views

గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావును ఘనంగా సత్కారించిన టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఖలీలుద్దీన్

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

గుంటూరు 24-01-2026 శనివారం : గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పిల్లి మాణిక్యరావును రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ ఆధ్వర్యంలో టిడిపి మైనార్టీ సెల్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ మాట్లాడుతూ, పిల్లి మాణిక్యరావు వంటి అనుభవజ్ఞుడు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన, పార్టీ సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం కలిగిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని ప్రశంసించారు. గుంటూరు జిల్లా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంలో పిల్లి మాణిక్యరావు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, మైనార్టీ వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కాలం నుంచే మైనార్టీలకు సముచిత గౌరవం, అవకాశాలు కల్పించిన పార్టీగా టిడిపి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, తనపై పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలతో నిరంతర సంబంధం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ సెల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లి మాణిక్యరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ సెల్ నాయకులు హాజీ లాల్ వజీర్, షేక్ బాజీ మాస్టారు కె ఇ హుసేన్, తదితరులు పాల్గొన్నారు

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleఓటు హక్కు.. రాజ్యాగం కల్పించిన ఓ వరం.. ఓ మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే బాధ్యత..
Next Article ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ‘‘సే నో టు డ్రగ్స్‌’’ వాక్‌థాన్‌ విజయవంతం

Related Posts

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

February 2, 2026

జిన్నాటవర్‌ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరించిన కమీషనర్ & మేయర్

January 26, 2026

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన నూరిఫాతిమా

January 26, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d