gunturnews.in

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

గుంటూరు ది. 02-02-2026 సోమవారం :కేంద్రంలో నరేంద్ర మోడీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజలకోసం కాకుండా, కొందరు పెద్ద వర్గాల లాభం కోసం మాత్రమే రూపొందించబడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలను విస్మరించడం, ఇప్పటికే కూనారీలుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత పతనంలోకి నెట్టడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యం అయి ఉందన్నారు. రూపాయి పతనం, వ్యాపారాల నష్టాలు, పౌరుల వినిమయ శక్తిలో కోతలు – ఇవన్నీ ఈ బడ్జెట్‌ ప్రభావంలో పెరుగుతాయని సూచించారు. దేశ భవిష్యత్తును కాపాడే కనీస ఆలోచన లేకుండా నిర్మలా సీతారామన్‌ గారు బడ్జెట్‌ ప్రవేశపెట్టారన్నారు. గ్రామీణ రైతులు, వ్యవసాయ కార్మికులు ఇప్పటికే అభివద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిలో, ఈ బడ్జెట్‌ రైతులకు వెన్నుపోటు మాత్రమే కలిగిస్తుంది. కొన్ని ప్రత్యేక పంటలపైనే ప్రాధాన్యం ఇచ్చి, మిగతా 75% రైతుల అవసరాలను వేరేలా వదిలివేయడం అన్యాయమని, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రైతు ఆదాయాన్ని కాపాడే చర్యలు లేవని ఆయన విమర్శించారు. అలాగే, ఆదాని, అంబానీల లాభాలకోసం మాత్రమే ప్రాధాన్యం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు లేకపోవడం, ప్రజా అవసరాలను నిర్లక్ష్యం చేయడం స్పష్టమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య రంగాలను విస్మరించడం, ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాలను తీసుకోకపోవడం ఈ బడ్జెట్‌ లో మరింత దారుణం అని చెప్పారు. ఎన్నికల సందర్భంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు ప్రకటించడం, రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిధులు లేకపోవడం, అమరావతి అభివద్ధికి ఇచ్చిన కేటాయింపులు తక్కువగా ఉండడం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని కూడా మోడీ ప్రభుత్వం తీరా నిలబెట్టలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌ భారత ప్రజలని వంచే దగాపూరిత బడ్జెట్‌ అని ఘాటుగా ప్రకటించారు. ‘‘ప్రస్తుత బడ్జెట్‌ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, కొందరు పెద్ద వర్గాల లాభాల కోసం మాత్రమే దష్టి సారించింది. రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఒక్క దిశానిర్దేశం ఇవ్వలేదన్నారు.

Exit mobile version