
గుంటూరు 24-01-2026 శనివారం :
వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈనెల 22,23,24వ తేదీల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్పేస్ సమ్మిట్ పోటీల్లో లక్ష్మీపురంలోని
శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాల తరపున ప్రదర్శించిన ప్రాజెక్టు ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నట్లు పాఠశాల కరస్పాండెంట్
పాటిబండ్ల విష్ణువర్ధన్ శనివారం ఓప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 88 స్పేస్ ఎగ్జిబిట్స్లో తమ పాఠశాల నుంచి 6,7వ
తరగతుల విద్యార్థులు ఇ. సుహ్రీత శ్రీ, ఎస్కే రెహాన్, ఎన్. జీవిక, ఎం. దేదీప్య రూపొందించిన ప్రాజెక్టు ద్వితీయ స్థానంలో నిలిచి, రూ.10వేలS నగదు
పురస్కారాన్ని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు సజనాత్మకత, ఆత్మవిశ్వాసాలను చాటుకున్నారని, ఏదైనా సాధించాలనే తపనే వారి విజయానికి కారణమని తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్ టీచర్లు డి. శోభారాణి, కె. అనూషను పాటిబండ్ల విష్ణువర్ధన్తో పాటు పాలక వర్గ సభ్యుడు గింజుపల్లి
వరప్రసాదరావు, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కష్ణవేణి అభినందించారు.
