gunturnews.in

ఈనెల 25న భారత రాజ్యాంగం–సవాళ్లపై సదస్సు

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కేఎస్‌ లక్ష్మణరావు, జేవీవీ ప్రతినిధులు

జనవిజ్ఞానవేదిక, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈనెల 25న ఉదయం 10 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ‘‘భారత రాజ్యాంగం–సవాళ్ళు’’ సదస్సును విజయవంతం చేయాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు కోరారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్, సుంకర రాజేంద్రప్రసాద్, ప్రొఫెసర్‌ చక్కా బెనర్జీ, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక నాయకులు జి.వెంకట్రావు, టి.జాన్‌బాబు, బి.ప్రసాద్, టీఆర్‌ రమేష్, వీవీకే సురేష్, ఇ.అనిల్‌కుమార్, ఎస్‌ఎం సుభానీ, కె.ప్రేమ్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, గురవయ్య పాల్గొన్నారు,

Exit mobile version