
గుంటూరు 26-01-2026 సోమవారం : పొన్నూరు రోడ్డులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ షాహినా బేగం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ షాహినా బేగం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను జీవితంలో ఆచరించినప్పుడే గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిజమైన అర్థం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలతో వేడుకలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు. చివరగా స్వీట్లు పంచి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమం లో ఆంధ్ర ముస్లిం కళాశాల కార్యవర్గ అధ్యక్షులు రహమాన్ ఇంకా డాక్టర్ మస్తాన్వలి హాజీ అబ్దుల్ కలాం రహమాన్ షరీఫ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షమీం బేగం, అధ్యాపకులు జీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు