
– ఈ నెల 30న జరిగే శాంతి ప్రదర్శనను జయప్రదం చేయండి
– వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా పిలుపు
సమావేశంలో మాట్లాడుతున్న నూరిఫాతిమా
అంజుమన్ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోయేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా స్పష్టం చేశారు. దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీన జరిగే భారీ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్ సీపీ ఈస్ట్ కార్యాలయంలో ముస్లీం మైనారిటీ నేతలు, పలు సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ గుంటూరు అంజుమన్ సంస్థకు సంబందించి చినకాకానిలో ఉన్న 71.57 ఎకరాల భూమని లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందనానరు. ఐటీ పార్క్ నిర్మాణం పేరుతో భూములను దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో ముస్లీం మైనారిటీలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 30న గుంటూరు నగరంపాలెంలోని ఈద్గా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుçపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ అబ్దుల్లాఖాన్, తూర్పు నియోజకవర్గ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ లియాఖత్, యువజన విభాగం తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ సుభాని, షేక్ బషీర్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వైఎస్సార్ రబ్బానీ, పలు అనుంధ విభాగాల నేతలు సూరజ్, షౌకత్అలీబేగ్, షేక్ ఉమర్ఫారూక్, అబ్దుల్రహీమ్, మైనారిటీ విభాగం డివిజన్ అధ్యక్షులు సలీం, నజీర్, జబీ, బషీర్, సైదా, సమ్మద్, కుతుబుద్దీన్, యూసఫ్, రియాజ్, ఖాజా, సుభాని తదితరులు పాల్గొన్నారు.
